Health Tips: రక్తంలో ఆక్సిజన్ స్థాయి తక్కువైందా.. ఈ ఆహారాలు తినడం ప్రారంభించండి..!

Health Tips: ఈరోజుల్లో చాలామంది రక్తంలో ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్నారు.

Update: 2023-03-15 11:02 GMT

Health Tips: రక్తంలో ఆక్సిజన్ స్థాయి తక్కువైందా.. ఈ ఆహారాలు తినడం ప్రారంభించండి..!

Health Tips: ఈరోజుల్లో చాలామంది రక్తంలో ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్నారు. దీనివల్ల రోజువారీ కార్యకలాపాలు చేయలేకపోతున్నారు. ఈ సమయంలో రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలని పెంచాలి. అందుకోసం ఎక్కువ ఆల్కలీన్ కంటెంట్ ఉన్న ఆహారాలని తీసుకోవాలి. అందుకోసం ప్రత్యేకంగా కొన్నిపండ్లు, కూరగాయలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

1. నిమ్మకాయ

నిమ్మకాయని ప్రతి ఇంట్లో వాడుతారు. సాధారణంగా దీనిని జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను తొలగించడానికి వినియోగిస్తారు. అయితే నిమ్మకాయ ఆక్సిజన్ ఆధారిత ఆహారం కూడా. ఇది శారీరక అవసరాలకు శక్తిని అందిస్తుంది.

2. మామిడి, బొప్పాయి

రోజూ బొప్పాయి తింటే రక్తంలో ఆక్సిజన్ కొరత ఉండదు. అయితే వేసవిలో మాత్రం తాజా మామిడి పండ్లను తీసుకోవాలి. ఈ రెండు పండ్లు మూత్రపిండాలను శుభ్రపరచడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. రక్తంలో ఆక్సిజన్‌ శాతాన్ని పెంచుతాయి.

3. పైనాపిల్, ఎండుద్రాక్ష, పియర్స్

మీరు రక్తంలో ఆక్సిజన్ స్థాయిని మెరుగుపరుచుకోవాలంటే రోజువారీ ఆహారంలో పైనాపిల్, ఎండుద్రాక్ష, బేరి పండ్లను చేర్చుకోవాలి. ఎందుకంటే ఈ ఆహారాలలో pH స్థాయి 8.5 వరకు ఉంటుంది. అంతేకాకుండా విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.

4. ఇతర ఆహారాలు

ఇతర ఆహారాలలో ముఖ్యంగా వెల్లుల్లి, అరటిపండ్లు, బెర్రీలు, ఖర్జూరం, క్యారెట్లు రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచడానికి పనిచేస్తాయి. ఇప్పుడే వీటిని డైట్‌లో చేర్చుకోండి. మంచి ప్రయోజనాలని పొందుతారు.

Tags:    

Similar News