Low Blood pressure: బీపీ తక్కువగా ఉంటే వెంటనే ఇవి తీసుకోండి..!

Low Blood Pressure: మీరు ఆరోగ్యంగా ఉండాలంటే రక్తపోటు సాధారణంగా ఉండాలి.

Update: 2022-09-22 10:00 GMT

Low Blood pressure: బీపీ తక్కువగా ఉంటే వెంటనే ఇవి తీసుకోండి..!

Low Blood Pressure: మీరు ఆరోగ్యంగా ఉండాలంటే రక్తపోటు సాధారణంగా ఉండాలి. ఒకవేళ ఇది పెరిగినా లేదా తగ్గినా అనేక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. సాధారణంగా మనం హైబీపీ గురించి మాట్లాడుతుంటాం కానీ తక్కువ రక్తపోటుతో బాధపడేవారు కూడా చాలామందే ఉంటారు. సాధారణ రక్తపోటు దాదాపు 120/80 ఉంటుంది. కానీ అది 90/60కి చేరుకుంటే చాలా ప్రమాదం. అప్పుడు హైపోటెన్షన్ సమస్య తలెత్తుతుంది. ఇది ఆందోళన కలిగించే విషయం. ఈ పరిస్థితిలో గుండె, మెదడు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులపై చెడు ప్రభావం పడుతుంది. ఇలాంటి సమయంలో కొన్ని ఆహార పదార్థాల ద్వారా లో బీపీని కంట్రోల్ చేయవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

1. కాఫీ

చాలా సమయం వరకు ఆహారం తీసుకోకుంటే రక్తపోటు తగ్గుతుంది. ఈ పరిస్థితిలో మీరు వెంటనే కాఫీ తాగాలి. ఎందుకంటే ఇందులో ఉండే కెఫిన్ బీపీని సాధారణ స్థాయికి తీసుకువస్తుంది. మీకు వెంటనే ఉపశమనం కలిగిస్తుంది.

2. ఉప్పు

తక్కువ రక్తపోటు సమస్య ఉన్నవారు తప్పనిసరిగా ఉప్పు తీసుకోవాలి. నిమ్మరసం లేదా ఏదైనా మొలకతో కలిపి తీసుకుంటే ఉత్తమం. ఇది మీ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.

3. బాదంపప్పు

బాదం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికి తెలుసు. అయితే వీటి ద్వారా తక్కువ రక్తపోటును నియంత్రించవచ్చు. రాత్రిపూట నీటిలో కొన్ని బాదంపప్పులను మరిగించి చల్లార్చి ఆ నీటిని తాగాలి. అలాగే బాదంలని మెత్తగా చేసి తినాలి. దీంతో బీపీ నార్మల్ అవుతుంది.

4. నీరు

మీ శరీరంలో నీటి కొరత ఉంటే అది లో బీపీకి కారణమవుతుంది. సాధారణంగా ఆరోగ్య నిపుణులు రోజూ కనీసం 2-3 లీటర్ల నీరు తాగాలని సూచిస్తున్నారు. శరీరం హైడ్రేటెడ్ గా ఉండాలంటే కొబ్బరి లేదా నిమ్మకాయ నీటిని తప్పనిసరిగా తాగాలి.

Tags:    

Similar News