Health Tips: గాల్ బ్లాడర్ స్టోన్స్‌ ఉంటే ఈ పదార్థాలకి దూరంగా ఉండాలి..!

Health Tips: కాలేయం కింద ఉన్న ఒక చిన్న అవయవం పిత్తాశయం.

Update: 2022-10-07 12:30 GMT

Health Tips: గాల్ బ్లాడర్ స్టోన్స్‌ ఉంటే ఈ పదార్థాలకి దూరంగా ఉండాలి..!

Health Tips: కాలేయం కింద ఉన్న ఒక చిన్న అవయవం పిత్తాశయం. ఇది కాలేయం ఉత్పత్తి చేసే పైత్య రసాన్ని నిల్వ చేస్తుంది. ఇది చిన్న ప్రేగులలో ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. పిత్తాశయం ఒక సున్నితమైన అవయవం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఇది హెల్దీగా ఉంటుంది. అయితే భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు పిత్తాశయంలో రాళ్లతో బాధపడుతున్నారు. ఇలాంటి సమయంలో కొన్ని ఆహారాలకి దూరంగా ఉండాలి. వాటి గురించి తెలుసుకుందాం.

1. పాలు, పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి మంచివిగా పరిగణిస్తారు. కానీ పిత్తాశయంలో రాళ్లు ఉన్న వ్యక్తులు వీటికి దూరంగా ఉండాలి. జున్ను, వెన్న, హెవీ క్రీం ఉన్న ఆహారపదార్థాలని తినకూడదు.

2. రోజువారీ ఆహారం నుంచి ఫ్రై చేసిన కూరలు, వేయించిన ఆహారపదార్థాలు, పొటాటో చిప్స్ వంటి ఆహారాలను పూర్తిగా మినహాయించాలి. ఎందుకంటే ఇవి పిత్తాశయంలో రాళ్ల వల్ల కలిగే నొప్పి, అసౌకర్యాన్ని బాగా పెంచుతాయి.

3. గత కొన్ని దశాబ్దాలుగా ప్యాకేజ్డ్ ఫుడ్ ట్రెండ్ చాలా పెరిగింది. వాటిలో ఉండే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ పిత్తాశయంలో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి. చాలా కంపెనీలు ప్యాక్ చేసిన ఆహారాలలో తక్కువ ట్రాన్స్ ఫ్యాట్ కలిగి ఉన్నాయని పేర్కొంటున్నాయి. అయితే ఇందులో వాస్తవం లేదు.

4. రెడ్ మీట్‌లో మనకు ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తున్నప్పటికీ అందులో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిత్తాశయంలో రాయి ఉంటే మాంసం తినకూడదు. చికెన్,

5. వాస్తవానికి ఆహారంలో పైబర్‌ కంటెంట్‌ తక్కువగా ఉండటం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడుతాయి. తెల్ల బియ్యం, శుద్ధి చేసిన చక్కెర, తెల్ల రొట్టె, వంటి శుద్ధి చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.

Tags:    

Similar News