Sperm Cells Precautions: పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గొదంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. అవేంటంటే..!

Sperm Cells Precautions: నేటి రోజుల్లో చాలామంది పురుషులు సంతానలేమితో బాధపడుతు న్నారు. దీనికి కారణం వీర్యకణాల సంఖ్య తగ్గిపోవడం.

Update: 2024-03-25 15:00 GMT

Sperm Cells Precautions: పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గొదంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. అవేంటంటే..!

Sperm Cells Precautions: నేటి రోజుల్లో చాలామంది పురుషులు సంతానలేమితో బాధపడుతు న్నారు. దీనికి కారణం వీర్యకణాల సంఖ్య తగ్గిపోవడం. కొన్నిసార్లు అవి చురుకుగా లేకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. జీవనశైలి లోపాల వల్లవీర్య కణాల సంఖ్య, నాణ్యతపై చెడు ప్రభావం పడుతోంది. వీర్యకణాలపై నెగటివ్‌ ఎఫెక్ట్ చూపే కొన్ని రకాల అలవాట్లను మానుకోవడం ఉత్తమం. అలాగే సరైన ట్రీట్‌మెంట్‌ తీసుకుంటే కచ్చితంగా పండంటి శిశువుకు తండ్రి అవుతారు. ఈ రోజు వీర్యకణాలను దెబ్బతీస్తున్న కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం.

సిగరెట్‌, ఆల్కహాల్‌

సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల్లో 2,000 రకాల రసాయనాలు ఉంటాయి. వీటిలో హానికరమైనది నికోటిన్‌. ధూమపానం వీర్యకణాల చలనాన్ని తగ్గిస్తుంది. దీంతో కొన్ని వీర్యకణాలు మాత్రమే అండాన్ని చేరుకుంటాయి. అలా పురుషుల్లో ధూమపానం స్త్రీలకు మాతృత్వాన్ని దూరం చేస్తుంది. అంతే కాదు వీర్యంలోని డీఎన్‌ఏకు హానిచేస్తుంది. దీంతో గర్భధారణ ఓ సమస్యగా మారుతుంది. మద్యపానంతో కూడా ఇవే సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి సంతానాన్ని కోరుకునే వాళ్లు ఈ రెండింటికి దూరంగా ఉండాలి.

ఊబకాయం

వీర్యకణాల నాణ్యత మీద ఊబకాయం చెడు ప్రభావం చూపుతుంది. ఈ సమస్య ఫలితంగా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈస్ట్రోజెన్‌, టెస్టోస్టిరాన్‌ హార్మోన్ల నిష్పత్తి మీద దెబ్బ పడుతుంది. అధిక బరువు సమస్య వృషణాల చుట్టూ ఉష్ణాన్ని అధికం చేస్తుంది. దీంతో వీర్యకణాల సంఖ్య, నాణ్యత రెండూ పడిపోతాయి.

గ్యాడ్జెట్లు, బిగుతు దుస్తులు

ఎక్కువ కాలంపాటు ల్యాప్‌టాప్‌ వాడటం, నిత్యం బిగుతు ప్యాంట్లు ధరించడం వల్ల వృషణాలు అధిక వేడికి గురవుతాయి. ఇది వీర్యకణాల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. వాటి సంఖ్య, నాణ్యత తగ్గిపోతుంది. కాబట్టి వృషణాల మీద ఒత్తిడి పడకుండా చూసుకోవాలి.

ఆహార పద్దతులు

వీర్యకణాల ఆరోగ్యం మీద ఆహారం ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ట్రాన్స్‌ఫ్యాట్లు అధికంగా ఉన్న రుచులు, ప్యాకేజ్డ్‌, రెడీ టు ఈట్‌ చిరుతిళ్లు వీర్యకణాల నాణ్యతను తగ్గిస్తాయి. చక్కెర అధికంగా ఉండే కార్బొనేటెడ్‌ పానీయాలు తాగకపోవడం మంచిది. తాజా పండ్లు, కూరగాయలు, ముతక ధాన్యాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలి.

నిద్రలేమి

వీర్యకణాల ఆరోగ్యానికి కనీసం ఎనిమిది గంటల నిద్ర అవసరం. క్రమబద్ధమైన నిద్ర అలవాటు లేకపోవడం, శారీరక శ్రమ కరువైపోవడం తదితర కారణాలు జీవన చక్రాన్ని దెబ్బతీస్తాయి. వీర్యకణాల చలనశీలత, నాణ్యత పెరగడానికి కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి అవసరమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News