Cholesterol Control Tips: పసుపు, నల్ల మిరియాలను ఇలా తీసుకోండి.. కొలెస్ట్రాల్‌ వెన్నెలా కరిగిపోతుంది..!

Bad Cholesterol: తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, జీవనశైలిలో వస్తోన్న మార్పుల నేపథ్యంలో అనారోగ్య సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది.

Update: 2025-01-17 06:55 GMT

Cholesterol Control Tips: పసుపు, నల్ల మిరియాలను ఇలా తీసుకోండి.. కొలెస్ట్రాల్‌ వెన్నెలా కరిగిపోతుంది..!

Bad Cholesterol: తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, జీవనశైలిలో వస్తోన్న మార్పుల నేపథ్యంలో అనారోగ్య సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరుగుతోన్న వారి సంఖ్య ఎక్కువుతోంది. సిరల్లో కొవ్వు పెరగడం వల్ల ప్రాణాంతక సమస్యలకు దారి తీస్తోంది. దీంతో చాలా మంది వైద్యులను సంప్రదిస్తున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరగడం వల్ల రక్త ప్రసరణలో ఇబ్బందులు వస్తున్నాయి. ఇది రక్తపోటు, హృదయ సంబంధిత సమస్యలకు దారి తీస్తోంది.

ఈ నేపథ్యంలోనే శరీరంలో కొలెస్ట్రాల్‌ను కంట్రోల్‌ చేయడానికి ప్రజలు ఆయుర్వేదాన్ని నమ్ముకుంటున్నారు. మన వంటింట్లో లభించే వస్తువులతోనే శరీరంలో కొలెస్ట్రాల్‌ను ఇట్టే కరిగించుకోవచ్చని మీకు తెలుసా.? ప్రతీ రోజూ ఉదయాన్నే మసాలా టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్‌ను ఇట్టే కరిగించవచ్చని చెబుతున్నారు. ఇందుకోసం కావాల్సిందల్లా మిరియాలు, పసుపు అంతే. ఈ రెండింటితో కలిపి తయారు చేసే మసాలా టీ తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్‌ కరిగిపోతుంది. ఇంతకీ ఈ టీని ఎలా తయారు చేసుకోవాలి.? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పసుపు, నల్ల మిరియాలతో చేసే టీ ని ప్రతీ రోజూ ఉదయాన్నే పడగడుపున తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ తొలగిపోతుంది. వీటిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ రోగులకు దివ్యౌషధంగా పని చేస్తుంది. ఇంతకీ ఈ టీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం ఒక గ్లాసులో వేడి నీటిని తీసుకోవాలి. అందులో అర టీస్పూన్ పసుపు, ఎండుమిరియాల పొడి వేసి నీటిని మరిగించాలి. ఆ తర్వాత నీటిని వడబోసి గోరు వెచ్చగా తీసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Tags:    

Similar News