Quit Smoking: పొగతాగడం మానేస్తే..నెలరోజుల్లో మీ శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు ఇవే

Update: 2025-02-24 12:14 GMT

Quit Smoking: పొగతాగడం ఆరోగ్యానికి హానికరమనే విషయం అందరికీ తెలిసిందే. పొగతాగడం వల్ల అనేక దుష్పరిణామాలు ఉంటాయి. శరీరంపై తీవ్రమైన నెగెటివ్ ప్రభావం చూపుతుంది. దీంతో అనేక వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పొగతాగడం వల్ల చాలా మంది గుండెపోటు, క్యాన్సర్ తో మరణిస్తున్నారు. ఏటా వీరి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. అయితే పొగతాగడం వల్ల తాగేవారికే కాదు పక్కనవారికి కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఊపిరితిత్తుల్లో వ్యర్థాలు చేరి క్యాన్సర్ కు కారణం అవుతాయి. కాబట్టి పొగ తాగడం అలవాటును మానుకోవాల్సి ఉంటుంది. అయితే పొగతాగడాన్ని మానుకుంటే నెల రోజుల్లో శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది:

పొగతాగడం వల్ల నోరు, ఆహార నాళం, ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశం తగ్గుతుంది. అంతేకాదు పొగ తాగ‌డం మానేస్తే క్యాన్స‌ర్ వ‌చ్చే అవకాశం ఉండదు. శ‌రీరంలో ఏవైనా చిన్న‌పాటి క్యాన్స‌ర్ క‌ణాలు ఉన్నా అవి కూడా తొలగిపోతాయి. మంచి పోషకాహారం తింటే క్యాన్స‌ర్ క‌ణాల‌ను శ‌రీరం నాశ‌నం చేస్తుంది. దీంతో క్యాన్స‌ర్ బారి నుంచి త‌ప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పొగ తాగ‌డం వ‌ల్ల దంతాలు, చిగుళ్లు త‌మ స‌హ‌జ‌సిద్ధ‌మైన రంగును కోల్పోతాయి. అలాగే నోట్లో బ్యాక్టీరియా చేరి నోటి నుంచి దుర్వాస‌న వ‌స్తుంది. దీంతో నోటి క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ పొగ తాగ‌డం మానేస్తే ఈ స‌మ‌స్య‌ల‌న్నింటి నుంచి త‌ప్పించుకోవ‌చ్చంటున్నారు నిపుణులు.

గుండె పోటు రాదు:

పొగతాగడం మానేస్తే బీపీ గణనీయంగా తగ్గుతుంది. గుండె కొట్టుకునే వేగం కూడా గణనీయంగా తగ్గిపోతుంది. పొగతాగడం మానేసిన ఏడాదిలోగా గుండెపోటు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. గుండెసంబంధిత వ్యవస్థ ఆరోగ్యగా ఉంటుంది. పొగతాగడం మానేసిన కొన్ని వారాల్లోగా ఊపిరితిత్తులు పూర్తిగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఊపిరితిత్తుల్లో ఉండే వ్యర్థాలు, టాక్సిన్స్ బయటకు పోతాయి. దీంతో దగ్గు, ఇన్పెక్షన్లు తగ్గుతాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. పొగతాగే వారిలో చాలా మదికి వాసన, రుచి అంతగా తెలియవు. నాసికా రంధ్రాలు, రుచి కళికలు సరిగ్గా పనిచేయవు. కానీ పొగ తాగడం మానేసిన తర్వాత అవి ఎప్పటి వలే పనిచేస్తాయి.

రోగ నిరోధ‌క వ్య‌వస్థ‌కు:

పొగ తాగ‌డం వ‌ల్ల వృద్ధాప్య ఛాయ‌లు వస్తాయి. చిన్న వ‌య‌స్సులోనే వృద్ధుల్లా క‌నిపిస్తారు. పొగ తాగ‌డం మానేసినట్లయితే.. చ‌ర్మం లోప‌ల ఉండే వ్య‌ర్థాలు, టాక్సిన్లు బ‌య‌ట‌కు పోతాయి. దీంతో చ‌ర్మం అంత‌ర్గ‌తంగా క్లీన్ అవుతుంది. చ‌ర్మంపై ఉండే ముడ‌త‌లు, మ‌చ్చలు పోయి చ‌ర్మం కాంతివంతంగా క‌నిపిస్తుంది. తిరిగి య‌వ్వ‌నంగా మారుతారు.

Tags:    

Similar News