Diabetic: డయాబెటీస్ పేషెంట్లు నెయ్యి తినొచ్చా.. తింటే ఏం జరుగుతుంది..!

Diabetic: డయాబెటీస్‌ పేషెంట్లు ఏం తినాలి, ఏం తినకూడదు అనే గందరగోళం ఎప్పుడూ ఉంటుంది.

Update: 2022-03-04 16:00 GMT

Diabetic: డయాబెటీస్ పేషెంట్లు నెయ్యి తినొచ్చా.. తింటే ఏం జరుగుతుంది..!

Diabetic: డయాబెటీస్‌ పేషెంట్లు ఏం తినాలి, ఏం తినకూడదు అనే గందరగోళం ఎప్పుడూ ఉంటుంది. కొంతమంది నెయ్యి, నూనె, మసాలా దినుసులకు దూరంగా ఉండాలని చెబుతారు. మరికొందరు దేశీ నెయ్యి తీసుకోవడం తప్పు అంటారు. ఈ పరిస్థితిలో మీరు ఏం చేస్తారు. నెయ్యి తినాలా వద్దా అనేది తెలుసుకుందాం. డైటీషియన్ల ప్రకారం దేశీ నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది మీ ఆహారంలో ఉండే పోషకాలను నాశనం చేయనివ్వదు. ఈ ప్రక్రియ కారణంగా రక్తంలో చక్కెర స్థాయి కంట్రోల్‌ అవుతుంది. అంటే డయాబెటిక్ పేషెంట్లు ఆహారంలో దేశీ నెయ్యిని తీసుకోవచ్చు. కానీ దాని పరిమాణం తక్కువగా ఉండాలి. లేదంటే చెడు ఫలితాలు ఉంటాయి.

అంతే కాదు దేశీ నెయ్యిని తీసుకుంటే శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. అలాగే గట్ హార్మోన్ల పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఇది డయాబెటీస్‌ని అదుపులో ఉంచుతుంది. చాలా మంది డైటీషియన్ల ప్రకారం డయాబెటీస్‌లో వంట నూనె హానికరం అని చెప్పారు. కానీ నెయ్యి తినకూడదని ఎక్కడా చెప్పలేదు. మీరు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి శుద్ధి చేసిన నూనెను ఉపయోగిస్తే మీరు అతిపెద్ద తప్పు చేస్తున్నారు. డయాబెటీస్‌ వ్యాధిగ్రస్తులు వంటనూనె వాడటం పూర్తిగా మానేయాలి. మీరు నూనెకు బదులుగా అర టీస్పూన్ నెయ్యిని ఉపయోగించవచ్చు. కూరలు వండటానికి కూడా నెయ్యి ఉపయోగిస్తే చాలా మంచిది.

డయాబెటీస్‌ పేషెంట్లు అదనపు కొవ్వును తీసుకోకుండా ఉండాలి. కొందరు వ్యక్తులు పప్పులలో అదనపు నెయ్యి తింటారు. కానీ మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే అలా చేయకుండా ఉండండి. దేశీ నెయ్యి మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ దానిని ఎక్కువగా తీసుకోవద్దు. రోజుకు రెండు చెంచాల కంటే ఎక్కువ నెయ్యిని తినకూడదని గుర్తుంచుకోండి. 

Tags:    

Similar News