Dates Health Benefits: రోజూ రెండు ఖర్జూరాలు తింటే చాలు.. ఎన్ని మార్పులో
Health benefits of dates: ఖర్జూరం విటమిన్లు, మినరల్స్, ఫైబర్‌కు పెట్టింది పేరు. ఇందులోని సహజ షుగర్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రతీ రోజూ క్రమం తప్పకుండా రెండు ఖర్జూరాలను తీసుకుంటే శరీరంలో జరిగే మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* ఖర్జూరాలను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి తక్షణ ఎనర్జీ అందిస్తుంది. ఖర్జూరాల్లో సహజ గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ ఎక్కువగా ఉంటాయి.
* ఖర్జూరంలో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ చక్కగా పని చేసేందుకు ఉపయోగపడుతుంది. మలబద్ధకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.
* ఖర్జూరంలో అధికంగా ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో దోహదపడుతుంది. దీంతో గుండె సమస్యలు కూడా దరిచేరవు.
* ఖర్జూరంలో కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల బలాన్ని పెంచి, ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించడంలో సహాయపడతాయి.
* మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఖర్జూర ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మెదడును రక్షించడంలో సహాయపడతాయి. ఆల్జీమర్స్ వంటి మెదడు సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గిస్తాయి.
* గర్భిణీలు ఖర్జూరం తింటే ఎంతో మేలు జరుగుతుంది. ప్రసవం సులభంగా జరగడంలో కూడా సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
* ఖర్జూరంలోని యాంటీ-ఏజింగ్ గుణాలు చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి. చర్మానికి తేమను అందించి మృదుత్వాన్ని పెంచుతాయి.
* ఖర్జూరంలో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ B6 అధికంగా ఉండటంతో కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
* బరువు తగ్గాలనుకునే వారు కూడా ఖర్జూరాలను తీసుకోవాలి. ఇందులో అధికంగా ఉండే ఫైబర్ కంటెంట్ కడుపు త్వరగా నిండిన భావన కలిగేలా చేస్తుంది.
నోట్: పైన తెలిపిన వివరాలు కేవలం ప్రాథమిక సమాచారం ఆధారంగానే అందించడం జరిగింది. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.