Health Tips: పండ్లు తినడంమంచిదే కానీ కొన్ని జీర్ణక్రియను దెబ్బతీస్తున్నాయి.. అవేంటంటే..?

Health Tips: ఏ సీజన్‌లో దొరికే పండ్లను ఆ సీజన్‌లో తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Update: 2024-03-27 12:45 GMT

Health Tips: పండ్లు తినడంమంచిదే కానీ కొన్ని జీర్ణక్రియను దెబ్బతీస్తున్నాయి.. అవేంటంటే..?

Health Tips: ఏ సీజన్‌లో దొరికే పండ్లను ఆ సీజన్‌లో తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పండ్లు తినడం ఆరోగ్యానికి శ్రేయస్కరం కానీ కొన్నిపండ్ల వల్ల కడుపు సమస్యలు ఎదురవుతున్నాయి. కొంతమంది అల్పాహారంగా పండ్లను తినడానికి ఇష్టపడతారు. దీని కారణంగా ఉబ్బరం సమస్య ఎదురవుతుంది. పండ్లు తినడంలో సమస్య ఉన్నవారు పరగడుపున తినకూడదు. ఎలాంటి పండ్లను పరగడుపున తినకూడదో ఈ రోజు తెలుసుకుందాం.

పుచ్చకాయ

కొంతమంది పుచ్చకాయ తినడం వల్ల ఉదర సమస్యలను ఎదుర్కొంటారు. ఇది సహజంగా లభించే ఫ్రక్టోజ్‌ని కలిగి ఉంటుంది. ఇది తినడం వల్ల కొంతమందిలో జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. డయేరియా, ఎసిడిటీ లేదా అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. ఇప్పటికే ఈ సమస్య ఉన్నవారు అపానవాయువును ఎదుర్కొంటారు. ఇలాంటి వారు దీనికి దూరంగా ఉండడం మంచిది.

ఆపిల్, బ్లూబెర్రీ

యాపిల్స్, బ్లూబెర్రీలు ఒక రకమైన సహజ చక్కెర ఉన్న పండ్లు. కొందరు వ్యక్తులు సహజ చక్కెరను జీర్ణం చేసుకోలేరు. దీని కారణంగా వారు గ్యాస్ సమస్యలను ఎదుర్కొంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం శరీరంలో సార్బిటాల్ మొత్తాన్ని పెంచడం వల్ల పిల్లలలో అతిసారం ఏర్పడుతుంది. దాల్చిన చెక్క, లవంగాలు, ఎండుమిరియాలు కలిపి నీటిలో ఉడికించి తినాలి.

ఎండిన ఆప్రికాట్లు

ఎండిన ఆప్రికాట్లు తిన్న తర్వాత చాలా మంది ఉబ్బరం లేదా అసిడిటీ సమస్యలను ఎదుర్కొంటారు. ఇందులో ఫ్రక్టోజ్ ఉంటుంది. దీన్ని ఎక్కువగా తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. దీన్ని సరిగ్గా తినాలనుకుంటే రాత్రంతా నానబెట్టి ఉదయం తినాలి.

Tags:    

Similar News