Health Tips : పేరెంట్స్ కు అలర్ట్.. పిల్లలకు జ్వరం వస్తే ఈ ఆహారాలను ఇవ్వండి

Health Tips : పేరెంట్స్ కు అలర్ట్.. పిల్లలకు జ్వరం వస్తే ఈ ఆహారాలను ఇవ్వండి

Update: 2025-08-22 10:30 GMT

Health Tips : పేరెంట్స్ కు అలర్ట్.. పిల్లలకు జ్వరం వస్తే ఈ ఆహారాలను ఇవ్వండి

Health Tips : వాతావరణంలో మార్పులు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న కారణంగా చాలా మంది పిల్లలు తరచుగా జ్వరం, జలుబు వంటి ఆరోగ్య సమస్యలకు గురవుతుంటారు. ఈ సమయంలో పిల్లలు సరిగా ఆహారం తీసుకోకపోవడంతో వారి ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. అటువంటి సందర్భాల్లో పిల్లలకు కొన్ని రకాల ఆహారాలను తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే సరైన ఆహారమే శరీరానికి రోగాలతో పోరాడే శక్తినిస్తుంది.

పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు ఇవ్వాల్సిన ఆహారాలు

సూప్: జ్వరం వచ్చినప్పుడు పిల్లలకు సూప్ ఇవ్వడం చాలా మంచిది. సూప్‌లో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇది పిల్లలు జ్వరం నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, రాగి అంబలి కూడా ఇవ్వవచ్చు. వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న పిల్లలకు రాగి అంబలి మంచి పోషకాలను అందిస్తుంది. ఇది సులభంగా జీర్ణం కూడా అవుతుంది.

ద్రవ ఆహారాలు: జ్వరం వచ్చినప్పుడు శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. కాబట్టి పిల్లల శరీరం డీహైడ్రేట్ అవకుండా జాగ్రత్త పడాలి. ఇందుకు నీరు మరియు కొబ్బరి నీళ్ళు ఇవ్వడం చాలా ప్రయోజనకరం. పెరుగు కూడా ఇవ్వవచ్చు. ఇందులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. పెరుగు తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒకవేళ పిల్లలు బాగా డీహైడ్రేషన్ అయితే డాక్టర్ సలహా మేరకు ఓఆర్ఎస్ కూడా ఇవ్వవచ్చు.

సీజనల్ పండ్లు: జ్వరం సమయంలో శరీరానికి ఎక్కువ విటమిన్లు, శక్తి అవసరం. కాబట్టి సీజనల్ పండ్లను పిల్లలకు ఇవ్వాలి. అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది, ఇది సులభంగా జీర్ణమవుతుంది. తేలికగా జీర్ణమయ్యే యాపిల్ లేదా బేరి పండ్లను కూడా ఇవ్వవచ్చు. బొప్పాయి, నారింజ పండ్లను తినడం వల్ల పిల్లల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది జ్వరంతో బాధపడుతున్న పిల్లల శరీరంలో నీటి శాతాన్ని పెంచి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది.

ఏ ఆహారాలు ఇవ్వకూడదు

జ్వరం వచ్చినప్పుడు కొన్ని రకాల ఆహారాలను పిల్లలకు ఇవ్వకూడదు. ఎందుకంటే అవి జీర్ణం చేసుకోవడం కష్టం, వాటి వల్ల పిల్లల ఆరోగ్యం మరింత పాడవుతుంది. కాబట్టి, మసాలా, నూనె మరియు వేయించిన ఆహారాలు, చాక్లెట్లు, కుకీలు, ఇతర స్వీట్లను ఇవ్వడం మానుకోండి. అలాగే కూల్ డ్రింక్స్ కూడా ఇవ్వకూడదు.

Tags:    

Similar News