Bad Breath: ఉల్లిపాయ తిన్న తర్వాత నోటి దుర్వాసన భరించలేరు.. వదిలించుకోవడం ఎలా..?

Bad Breath: పచ్చి ఉల్లిపాయ తినడం అంటే కొంతమందికి మక్కువ ఎక్కువ. ప్రతి దానిలో ఉల్లిపాయ ఉండాల్సిందే.

Update: 2022-02-23 12:30 GMT

Bad Breath: ఉల్లిపాయ తిన్న తర్వాత నోటి దుర్వాసన భరించలేరు.. వదిలించుకోవడం ఎలా..?

Bad Breath: పచ్చి ఉల్లిపాయ తినడం అంటే కొంతమందికి మక్కువ ఎక్కువ. ప్రతి దానిలో ఉల్లిపాయ ఉండాల్సిందే. బిర్యానీ దగ్గరి నుంచి పావ్బాజీ వరకు అన్నింట్లో ఉల్లిపాయ వేసుకొని లాగించేస్తారు. అసలు భారతీయులు ఉల్లిపాయ లేనిదే ఏ వంటకం వండరంటే అతిశయోక్తి కాదు. వాస్తవానికి ఉల్లిపాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎన్నో ఆరోగ్య సమస్యలని పరిష్కరిస్తుంది. కానీ తిన్న తర్వాత నోటి నుంచి భరించలేని దుర్వాసన వస్తోంది. దీనికి కారణం ఉల్లిపాయలో ఉండే గుణాలు. ఈ బ్యాడ్ స్మెల్ని పోగొట్టుకోవాలంటే ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. వాటి గురించి తెలుసుకుందాం.

పచ్చి ఉల్లిపాయను తిన్న తర్వాత నోటి నుంచి దుర్వాసన వస్తుంది. దీని నుంచి బయటపడటానికి తాజా పండ్లను తినాలి. నివేదికల ప్రకారం తాజా పండ్లతో నోటిలో ఉండే సల్ఫర్ వాసన తగ్గుతుంది. నోటి దుర్వాసన తొలగించడంలో కొత్తిమీర ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది తిన్నాక వాసన పోతుంది. ఫ్రెష్ గా ఉంటుంది. మీరు పచ్చి కొత్తిమీర తినాలనుకుంటే దాని ఆకులను కొన్ని తీసుకుని కాసేపు నోటిలో వేసుకొని నమలండి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఏలకులు నమలడం వల్ల నోటి దుర్వాసన పోతుంది. మీరు వీటిని నీటిని వేసుకొని కూడా తాగవచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

పచ్చి ఉల్లిపాయల దుర్వాసనను తొలగించడానికి పుదీనా నీటిని తయారు చేసి సిప్-సిప్ తాగండి. ఇందులో మీరు సోపు గింజలను కూడా కలుపుకోవచ్చు. ఇది ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా ఉత్తమంగా పనిచేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఆరోగ్యానికి మంచిదని భావించే యాపిల్ సైడర్ వెనిగర్ నోటి దుర్వాసనను దూరం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉల్లిపాయలు తిన్న తర్వాత నోటిలోని దుర్వాసనను తొలగించడానికి దీన్ని ఉపయోగించడం చాలా సులభం. మీరు చేయాల్సిందల్లా ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్ను నీటిలో వేసుకొని తాగాలి. కావాలంటే నోరు కూడా శుభ్రం చేసుకోవచ్చు.

Tags:    

Similar News