Health Tips: ఉక్కులాంటి ఎముకల కోసం ప్రత్యేక రొట్టెలు.. అద్భుత ఫలితాలు చూస్తారు..!

Health Tips: ఎముకలు బలంగా ఉన్నప్పుడే శరీరం దృఢంగా మారుతుంది.

Update: 2023-03-31 13:30 GMT

Health Tips: ఉక్కులాంటి ఎముకల కోసం ప్రత్యేక రొట్టెలు.. అద్భుత ఫలితాలు చూస్తారు..!

Health Tips: ఎముకలు బలంగా ఉన్నప్పుడే శరీరం దృఢంగా మారుతుంది. ఇందుకోసం పౌష్టికాహారం తీసుకోవాలి. రోజువారీ జీవితంలో చాలామంది గోధుమ పిండితి చేసిన చపాతీలని తింటారు. వీటివల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. అందుకే అనేక ఇతర ధాన్యాలతో తయారు చేసిన రొట్టెలని తింటే ఎముకలకు విపరీతమైన బలం చేకూరుతుంది. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

చిరు ధాన్యాలు, రాగిపిండి

మీరు మిల్లెట్, రాగులతో చేసిన రోటీని తీసుకోవాలి. ఇందులో ప్రొటీన్లు, పీచుపదార్థాలు, క్యాల్షియం, విటమిన్లు వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ రొట్టెలు తినడం వల్ల శరీరానికి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. ఎముకలు బలపడతాయి.

కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం

వయస్సు పెరిగేకొద్దీ ఎముకలు బలహీనపడుతాయి. తరచుగా వృద్ధాప్యంలో కీళ్ల సమస్య ఎదురవుతుంది. ఈ పరిస్థితుల్లో జొన్న, రాగుల పిండితో చేసిన రోటీలు తినడం వల్ల కీళ్ల నొప్పులు మాయమవుతాయి.

ఆర్థరైటిస్‌లో ఉపశమనం

మిల్లెట్, రాగులతో చేసిన రొట్టెలను తినాలి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. మంటను తగ్గించడంలో సహాయపడతాయి.

ఎముకలు దృఢంగా

మిల్లెట్‌లో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. దీంతోపాటు భాస్వరం కూడా లభిస్తుంది. ఇది ఎముకలకు విపరీతమైన బలాన్ని చేకూరుస్తుంది.

ఎముకలు ఫ్రాక్చర్ తక్కువ

మిల్లెట్, రాగులతో చేసిన రొట్టెని ఆహారంలో తీసుకోవడం వల్ల ఎముకలు విరగడం చాలా వరకు తగ్గుతుంది. కావాలంటే ఈ రెండు పిండిలని కలిపి రోటీలు చేసుకోవచ్చు.

Tags:    

Similar News