Health Tips: చక్కెర అదుపులో ఉండాలంటే ఇవి బెస్ట్‌.. మందులతో పనే లేదు..!

Health Tips: డయాబెటిస్ అనేది ఈ రోజుల్లో వేగంగా వ్యాపించే వ్యాధి.

Update: 2022-11-12 10:15 GMT

Health Tips: చక్కెర అదుపులో ఉండాలంటే ఇవి బెస్ట్‌.. మందులతో పనే లేదు..!

Health Tips: డయాబెటిస్ అనేది ఈ రోజుల్లో వేగంగా వ్యాపించే వ్యాధి. మారుతున్న జీవనశైలి, ఆహారపుటలవాట్ల వల్ల అనేక మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మధుమేహం అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.. లేదంటే ఇది ప్రమాదకరంగా మారుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తుల కోసం మార్కెట్‌లో అనేక మందులు ఉన్నాయి. అయితే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా షుగర్‌ స్థాయిలని నియంత్రించవచ్చు. డైట్‌లో తప్పనిసరిగా కొన్ని ఆహారాలని చేర్చుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం.

ముల్లంగి

ముల్లంగిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రక్తంలో చక్కెర నియంత్రించడంలో సహాయపడుతుంది. మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే రోజూ ముల్లంగిని సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. ఇది కాకుండా ముల్లంగి పరోటాలను తయారు చేసి తినవచ్చు.

కాకరకాయ

కాకరకాయ అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. చాలా మంది రుచి కారణంగా దీనిని తినడానికి ఇష్టపడరు. కానీ బరువును తగ్గించడంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. కాకరలో పాలీపటైట్-పి సమ్మేళనం మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది.

రాగి పిండి

గోధుమలలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల దీనిని తగ్గించడం సరికాదు. కానీ గోధుమ పిండికి బదులుగా రాగి పిండిని ఉపయోగించవచ్చు. ఇది చక్కెరని కంట్రోల్‌ చేస్తుంది.

బుక్వీట్

ప్రజలు ఉపవాస సమయంలో బుక్వీట్ పిండిని తీసుకుంటారు. ఇది డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బుక్వీట్ పిండిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది.

Tags:    

Similar News