Health: లివర్‌ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎప్పుడు అలర్ట్ అవ్వాలి

Update: 2025-01-27 12:56 GMT

లివర్‌ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎప్పుడు అలర్ట్ అవ్వాలి 

Liver damage symptos: శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయాల్లో లివర్‌ ఒకటి. శరీరంలో ముఖ్యమైన విధులను నిర్వహించడంలో లివర్‌దే కీలక పాత్ర. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపడంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. శరీరాన్ని పూర్తిగా డిటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది. అందుకే లివర్‌ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు చెబుతుంటారు. ఇంతకీ లివర్‌ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? లివర్‌ పాడైనప్పుడు కనిపించే లక్షణాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

లక్షణాలు..

లివర్‌ ఆరోగ్యం దెబ్బతింటే చర్మం లేదా కండ్లు పసుపు రంగులోకి మారుతాయి. ఏ పని చేయకపోయినా తీవ్ర అలసట ఉండడం కూడా లివర్‌ డ్యామేజ్‌కి సంకేతం. అదే విధంగా కడుపు ఉబ్బడం, కడుపులో కుడి భాగంలో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తే. అలాంటప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.

నిత్యం వికారంగా ఉంటున్నా.. జీర్ణ సంబంధిత సమస్యలు వస్తున్నా, ఆకలి లేకపోయినా, వాంతులు వంటి లక్షణాలు లివర్‌ సంబంధిత సమస్యలకు లక్షణాలుగా చెప్పొచ్చు. ఇక మూత్రం ముదురు గంగులోకి మారినా అలర్ట్‌ అవ్వాల్సిందే.

ఇలా పదిలం..

మీ లివర్‌ ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బీట్‌రూట్, పసుపు, ఆకు కూరలు, వెల్లుల్లి వంటి ఆహారాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఇక శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం వాటర్‌ ఎక్కువగా తాగుతుండాలి. మరీ ముఖ్యంగా నిమ్మరసం కలిపిన నీటిని తాగడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది.

లివర్‌ ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. తీవ్రమైన మానసిక ఒత్తిడి కాలేయంపై ప్రభావం పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటి వాటిని అలవాటు చేసుకోవాలి. అదే విధంగా ఆల్కహాల్‌కు పూర్తి దూరంగా ఉండాలి. కాలేయ ఆరోగ్యాన్ని ఆల్కహాల్‌ దెబ్బతిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదిలా ఉంటే జంక్ ఫుడ్, నూనేలో వేపిన ఆహారపదార్థాలు, కూల్‌ డ్రింక్స్‌కు కూడా దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే... మీ లివర్ పూర్తి ఆరోగ్యంగా ఉంటుంది. మిమ్మల్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.

Tags:    

Similar News