Health Tips: వీటివల్ల కిడ్నీలు దెబ్బతింటున్నాయి.. ఇతర వ్యాధుల ప్రమాదం పెరుగుతోంది..!

Health Tips: నేటికాలంలో కిడ్నీ వ్యాధులు గతంలో కంటే ఎక్కువయ్యాయి.

Update: 2023-03-13 12:30 GMT

Health Tips: వీటివల్ల కిడ్నీలు దెబ్బతింటున్నాయి.. ఇతర వ్యాధుల ప్రమాదం పెరుగుతోంది..!

Health Tips: నేటికాలంలో కిడ్నీ వ్యాధులు గతంలో కంటే ఎక్కువయ్యాయి. కిడ్నీలు చెడిపోతే శరీరంలోని వడపోత ప్రక్రియ దెబ్బతింటుంది. దీనివల్ల టాక్సిన్స్ బయటకు రాలేవు. ఈ పరిస్థితిలో అనేక ఇతర వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ప్రతి మనిషి తన కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. లేదంటే ప్రాణం కోల్పోవాల్సి వస్తుంది. అయితే కిడ్నీ తీవ్రంగా దెబ్బతినే చెడు అలవాట్ల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

1. ధూమపానం

సిగరెట్, హుక్కా, బీడీ, గంజాయి వంటి ధూమపానం శరీరం మొత్తానికి హానికరం. ఇది కిడ్నీకి కూడా చాలా హాని చేస్తుంది. ఇది మూత్రపిండాలపై ఒత్తిడి తెస్తుంది. ధూమపానం కారణంగా రక్తం సరఫరా చేసే సిరలు ప్రభావితమవుతాయి. ఇది రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. చివరికి మూత్రపిండాలని ఫెయిల్‌ అయ్యే విధంగా చేస్తుంది.

2. అనారోగ్యకరమైన ఆహారాలు

మనం నిత్యం తీసుకునే కొన్నిరకాల ఆహారాల వల్ల మూత్రపిండాల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. కాబట్టి కిడ్నీకి ప్రయోజనకరమైన ఆహారాన్ని తీసుకుంటే ఉత్తమం. అనారోగ్యకరమైన ఆహారాన్ని నిరంతరం తినడం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి. ప్రాసెస్ చేసిన ఆహారం, సోడియం అధికంగా ఉండే ఆహారాన్ని డైట్ నుంచి మినహాయించండి.

3. సోమరితనం

మీరు సోమరిపోతులైతే కచ్చితంగా కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది. ప్రతిరోజూ వ్యాయామం లేదా శారీరక శ్రమ చేయాలి. దీని కారణంగా రక్త సరఫరా సరిగ్గా జరిగి మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.

4. తగినంత నీరు

కిడ్నీ ఆరోగ్యంగా ఉండటానికి నీరు తాగడం చాలా ముఖ్యం. అప్పుడే వడపోత ప్రక్రియ సరిగ్గా జరుగుతుంది. డీ హైడ్రేషన్‌ మూత్రపిండాలకి చెడు పరిస్థితిని కలిగిస్తుంది. చాలా మంది ఆరోగ్య నిపుణులు రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలని సూచిస్తారు.

Tags:    

Similar News