Tea Side Effects: తరచుగా టీ తాగుతున్నారా.. శరీరం నుంచి ఇది వెళ్లిపోతుంది జాగ్రత్త..!

Tea Side Effects: ఈ రోజుల్లో చాలామంది టీకి బానిసలుగా మారిపోయారు. ఎంతలా అంటే ప్రపంచంలో నీటి తర్వాత అత్యధికంగా తాగే పానీయం టీ మాత్రమే.

Update: 2023-09-16 16:00 GMT

Tea Side Effects: తరచుగా టీ తాగుతున్నారా.. శరీరం నుంచి ఇది వెళ్లిపోతుంది జాగ్రత్త..!

Tea Side Effects: ఈ రోజుల్లో చాలామంది టీకి బానిసలుగా మారిపోయారు. ఎంతలా అంటే ప్రపంచంలో నీటి తర్వాత అత్యధికంగా తాగే పానీయం టీ మాత్రమే. కొంతమంది ఉదయం నిద్ర లేచిన వెంటనే టీ తాగుతారు. ఇంకా ఇంట్లో టీ, ఆఫీసులో టీ, ఫ్యాక్టరీలో టీ, సెంటర్‌లో టీ ఇలా ఎక్కడ పడితే అక్కడ టీ తాగుతూనే ఉంటారు. దీనివల్ల చాలా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నాయి. శరీరానికి తీవ్రమైన హాని చేస్తుంది. ముఖ్యంగా శరీరంలో ఐరన్‌ లోపానికి కారణమవుతుంది. దీనివల్ల చాలామంది రక్తహీనతకి గురవుతున్నారు. టీ ఎఫెక్ట్‌ ఏ విధంగా ఉందో ఈ రోజు తెలుసుకుందాం.

టీలో ఉండే శత్రువులు

టీ ఆకులలో టానిన్లు ఉంటాయి. వీటివల్ల శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. శరీరంలో బలహీనత వస్తుంది. అధికంగా టీ తాగే వ్యక్తులు నిద్రలేమి, వికారం, తలనొప్పి, టెన్షన్, ఆందోళన, గ్యాస్ సమస్యలతో ఇబ్బందిపడుతారు.

టీ తాగే ముందు ఈ పని చేయండి

టీలో ఉండే కెఫిన్, టానిన్ ఆరోగ్యానికి మంచిది కాదు. చాలా మంది పరగడుపున టీ తాగుతారు. ఇది పొట్టలో యాసిడ్‌ని పెంచుతుంది. శరీరంలోని pH సమతుల్యతను దెబ్బతీస్తుంది. అజీర్ణం సహా అనేక సమస్యలు ఎదురవుతాయి. దీన్ని నివారించడానికి టీ తాగే 20 నిమిషాల ముందు ఈ పని చేయండి.

టీ తాగే ముందు నానబెట్టిన గింజలు లేదా సగం ఆపిల్ తినండి. ఇవి pH ఆల్కలీన్‌ కలిగి ఉంటాయి. దీని కారణంగా కడుపు ఆమ్లాలు సాధారణమవుతాయి. ఈ పద్ధతిని అవలంబిస్తే గుండెల్లో మంట, మలబద్ధకం, గ్యాస్, బలహీనతను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.

ఎండుద్రాక్ష

ఎండుద్రాక్షను నానబెట్టి తినడం వల్ల కడుపులో యాసిడ్ స్థాయి తగ్గుతుంది. ఇది శరీరానికి ఐరన్, విటమిన్ బి-కాంప్లెక్స్‌ను అందిస్తుంది. ఇది టానిన్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది. బాదంపప్పులు, వాల్ నట్స్ ను రాత్రి నానబెట్టి ఉదయం నిద్ర లేవగానే తింటే అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, గుండె జబ్బులు, విపరీతమైన ఆకలి సమస్యలు ఉండవు. 

Tags:    

Similar News