Dog Bite: కుక్క కరిస్తే వెంటనే ఈ జాగ్రత్తలు తీసుకోండి లేదంటే ప్రాణాలకు ప్రమాదం
Precautions for Dog Bite: కుక్క కాటుకు గురైతే భయపడకండి. ఇన్ఫెక్షన్లు, రేబిస్ ముప్పు నుంచి రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన అత్యవసర చర్యలు, లక్షణాలు, నివారణ మార్గాలు తెలుసుకోండి.
Dog Bite: కుక్క కరిస్తే వెంటనే ఈ జాగ్రత్తలు తీసుకోండి లేదంటే ప్రాణాలకు ప్రమాదం
Precautions for Dog Bite: కుక్క కాట్లు ఎప్పుడూ అనూహ్యంగా జరిగిపోతాయి. ముఖ్యంగా చిన్నారులకు ఇది అధిక ప్రమాదంగా మారవచ్చు. కుక్క కరిచిన వెంటనే సరైన వైద్యచర్యలు తీసుకోకపోతే, శరీరంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్లు లేదా రేబిస్ వంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఆలస్యం చేయకుండా ఈ సూచనలు పాటించండి.
కుక్క కరిస్తే వెంటనే చేయవలసిన చర్యలు:
ఆక్రమణ చేసిన కుక్క నుంచి దూరంగా ఉండండి.
మళ్లీ కరవకుండా అప్రమత్తంగా ఉండండి.
గాయాన్ని సబ్బు, నీటితో బాగా శుభ్రం చేయండి.
ఇది బ్యాక్టీరియా సంక్రమణను తగ్గించడంలో మొదటి మెట్టు.
టాపికల్ యాంటిసెప్టిక్స్ ఉపయోగించండి.
పోవిడోన్ అయోడిన్ లేదా ఇతర యాంటిబయోటిక్ క్రీమ్స్ పూయండి.
గాయానికి కట్టు వేయండి.
శుభ్రంగా ఉండే బ్యాండేజీని ప్రతిరోజూ మార్చండి.
కుక్కకు వ్యాక్సిన్ వేసిందా తెలుసుకోండి.
పెంపుడు కుక్క అయితే, రేబిస్ టీకా ఉందో లేదో తెలుసుకోవడం కీలకం.
వైద్యుడిని వెంటనే సంప్రదించండి.
వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, చిన్న పిల్లలు, డయాబెటిక్ రోగులు ప్రత్యేకంగా జాగ్రత్త వహించాలి.
కుక్క కాటుతో వచ్చే ప్రమాదకరమైన సమస్యలు:
బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు: స్టెఫలోకోకస్, పాస్టురెల్లా, కాప్నోసైటోఫాగా వంటి సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశిస్తాయి.
నరాల, కండరాల నష్టం: లోతైన కాట్ల వల్ల శరీర నిర్మాణానికి భంగం వస్తుంది.
ఎముకలకు హాని: పెద్ద కుక్కల కాట్లు ఎముకలు పగలగొట్టే ప్రమాదం కలిగి ఉంటాయి.
రేబిస్ ముప్పు: టీకా వేయని కుక్కల వల్ల ప్రాణాంతక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది.
శాశ్వత గాయాల ముద్రలు: దీర్ఘకాలికంగా ఉండే గాయల గుర్తులు మానసికంగా కూడా ప్రభావం చూపుతాయి.
ఇన్ఫెక్షన్ నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలు:
♦ గాయంలో వాపు, రంగు మారడం, నొప్పి పెరగడం వంటి లక్షణాలపై కన్నేయండి.
♦ ఈ లక్షణాలు 24 గంటల నుంచి 14 రోజులలోపు రావచ్చు.
♦ వైద్యుడు సూచించిన యాంటిబయాటిక్స్ పూర్తిగా వాడటం మర్చిపోవద్దు – కోర్సు మధ్యలో ఆపకూడదు.
చిన్న పిల్లల్లో మరణ ముప్పు ఎక్కువగా ఉంటుందా?
అవును. 10 ఏళ్ల లోపు పిల్లలు రేబిస్ బారిన పడే ప్రమాదం ఎక్కువ. కాబట్టి, చిన్నారులకు కుక్క కాటు జరిగిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి.
కుక్క కాటు సమయంలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు:
♦ ఆలస్యం లేకుండా వైద్య సహాయం తీసుకోవాలి.
♦ గాయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అలానే వదలకూడదు.
♦ ఇంట్లో ఉన్న చిన్నారులను ఎప్పుడూ పర్యవేక్షణలో ఉంచాలి.
♦ రేబిస్ నివారణ టీకాలు పూర్తి డోసులో వేయించాలి.