Back Pain: ఆఫీసులో పనివల్ల వెన్నునొప్పి వస్తుందా.. ఇలా చేస్తే బెటర్..!

Back Pain: ఆఫీసులో గంటల తరబడి పని చేయడం నిరంతరం ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల వెన్ను నొప్పి వేధిస్తుంది.

Update: 2022-02-19 11:19 GMT

Back Pain: ఆఫీసులో పనివల్ల వెన్నునొప్పి వస్తుందా.. ఇలా చేస్తే బెటర్..!

Back Pain: ఆఫీసులో గంటల తరబడి పని చేయడం నిరంతరం ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల వెన్ను నొప్పి వేధిస్తుంది. కొన్నిసార్లు నొప్పి చాలా వరకు పెరుగుతుంది. 8 నుంచి 9 గంటల ఆఫీస్ కల్చర్ వల్ల చాలా మందికి వెన్ను నొప్పి వస్తుంది. కొంతమంది వెన్నునొప్పి సమస్యను ఏమీ పట్టనట్లు నిర్లక్ష్యం చేస్తారు. అయితే చాలా కాలంగా వెన్నునొప్పి సమస్య మీ ఆరోగ్యానికి ప్రమాదకరం అని గుర్తుంచుకోండి. కాబట్టి వెన్నునొప్పి ఎందుకు వస్తుంది. చికిత్స ఏంటో తెలుసుకోండి.

ఎక్కువసేపు కూర్చోకపోవడం లేదా నడవకపోవడం, అధిక బరువు లేదా వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్ల నడుము నొప్పి వస్తుంది. అధిక మానసిక ఒత్తిడి, అలసట కారణంగా, మన వెన్ను కండరాలు సాగదీయడం వల్ల వెన్నునొప్పి వస్తుంది. చాలా సార్లు రాత్రి పడుకునేటప్పుడు కాళ్లు ముడుచుకుని పడుకుంటారు. ఈ విధంగా నిద్రపోవడం వల్ల ఉపశమనం లభిస్తుందని కొందరు నమ్ముతారు. అయితే ఇలా పడుకోవడం వల్ల మీకు వెన్ను నొప్పి వస్తుంది. వీలైనంత వరకు రాత్రిపూట నేరుగా నిద్రించడానికి ప్రయత్నించండి.

ఎక్కడైనా నడుస్తున్నప్పుడు లేదా కూర్చున్నప్పుడు మీ వెనుకభాగం నిటారుగా ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా ఆఫీసులో ఎక్కువ సమయం గడిపే వ్యక్తులు స్ట్రెయిట్ పొజిషన్‌లో కూర్చోవాలి. ఎందుకంటే వారి జీవితకాలంలో సగానికి పైగా ఆఫీసులోనే గడుపుతారు. మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రతిరోజూ వ్యాయామాన్ని ఆశ్రయిస్తే ముందుకు వంగి ఉండే వ్యాయామాలు చేయకండి. మీకు తీవ్రమైన వెన్నునొప్పి ఉంటే కొన్ని రోజులు వ్యాయామం నుంచి విరామం తీసుకోవడమే బెటర్.

పని సంస్కృతి ప్రజలను కుర్చీకి అతుక్కుపోయేలా చేసింది. దీని కారణంగా వెన్నునొప్పి వస్తుంది. మీ విషయంలో కూడా ఇదే జరిగితే కనీసం ఒక గంట విరామంతో పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కడికైనా బయటకు వెళ్లలేకపోతే మీ క్యాబిన్ నుంచి కార్యాలయంలోని మరొక క్యాబిన్‌కు వెళ్లి పరిస్థితి గురించి ఆరా తీయండి. వెన్నునొప్పి నుంచి కూడా ఉపశమనం పొందుతారు.

Tags:    

Similar News