Health: రాత్రిపూట అన్నం తింటే ఆరోగ్యం పాడవుతుందా..!

Health: భారతదేశంలోని ప్రజల ప్రధాన ఆహారంలో అన్నం ఒకటి. అన్నం సులభంగా తయారు చేసుకోవచ్చు.

Update: 2022-05-18 14:30 GMT

Health: రాత్రిపూట అన్నం తింటే ఆరోగ్యం పాడవుతుందా..!

Health: భారతదేశంలోని ప్రజల ప్రధాన ఆహారంలో అన్నం ఒకటి. అన్నం సులభంగా తయారు చేసుకోవచ్చు. చాలా మందికి అన్నం అంటే చాలా ఇష్టం. రైస్‌లో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. దీనితో పాటు ఇందులో ప్రోటీన్, కొవ్వు, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ఇదిలావుండగా రాత్రిపూట అన్నం తినాలా వద్దా అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. దాని గురించి తెలుసుకుందాం.

బియ్యంలో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. కార్బోహైడ్రేట్ల నుంచి లభించే శక్తితో మనం మన రోజు వారీ పనులను సులభంగా చేసుకుంటాం. అన్నం పొట్టకి చాలా మేలు చేస్తుంది. ఉడకబెట్టిన అన్నం సులభంగా జీర్ణమవుతుంది. అన్నం జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల పోషకాలు శరీరంలోని అన్ని భాగాలకు చేరుతాయి. ఇది తన పనితీరును సాఫీగా నిర్వహిస్తుంది.

ప్రతిదానికి దాని ప్రయోజనాలతో పాటు కొన్ని ప్రతికూలతలు కూడా ఉంటాయి. రాత్రిపూట అన్నం తినడం వల్ల మీకు ఎలాంటి హాని కలుగుతుందో తెలుసుకుందాం. మీరు మీ బరువును తగ్గించుకునే పనిలో ఉన్నట్లయితే, రాత్రిపూట అన్నం తినకండి. కానీ బ్రౌన్ రైస్ తినవచ్చు. దీనివల్ల పిండి పదార్థాలకు బదులుగా ఫైబర్ లభిస్తుంది. దీంతో మీరు మొత్తం ఆహారంలో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ పొందవచ్చు.

Tags:    

Similar News