Vitamin B12: విటమిన్ బి 12 లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసా.. చాలా ప్రమాదం..?

Vitamin B12: శరీరంలో అన్ని విటమిన్లతో పాటుగా విటమిన్ బి 12 కూడా చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది.

Update: 2022-03-05 14:30 GMT

Vitamin B12: విటమిన్ బి 12 లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసా.. చాలా ప్రమాదం..?

Vitamin B12: శరీరంలో అన్ని విటమిన్లతో పాటుగా విటమిన్ బి 12 కూడా చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది లోపిస్తే అనేక వ్యాధులు శరీరాన్ని చుట్టుముడుతాయి. విటమిన్ బి 12నే కోబాలమిన్ అని కూడా పిలుస్తారు. ఆధునిక కాలంలో దీనిబారిన చాలామంది పడుతున్నారు. దీనికి కారణాలు బిజి షెడ్యూల్‌, మారిన జీవన పరిస్థితులు, ఆహారపు అలవాట్ల వల్ల ఇది లోపిస్తుంది. దీనిపై సరైన అవగాహన లేకుంటే మనిషి జీవించడం చాలా కష్టమవుతుంది.

బి 12 లోపిస్తే మతిమరుపు, కండరాల బలహీనత, నిస్సత్తువ, నోటిలో పుండ్లు, మూత్రం ఆపుకోలేకపోవటం, శ్వాసలో ఇబ్బందులు, రక్తహీనత వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. విటమిన్ బి12 తక్కువగా ఉండడం వల్ల హోమోసిస్టీన్ అనే అమైనో యాసిడ్ లెవల్స్ చాలా వరకు పెరుగుతాయి. మెదడు కణాలపై ప్రభావం చూపుతాయి. శరీరంలోకి చేరిన పిండిపదార్థాలు గ్లూకోజ్‌గా మారడానికి విటమిన్‌ బి12 అవసరం. ఈ జీవక్రియ ఫలితంగా శక్తి పుంజుకుని, శరీరంలోని నిస్సత్తువ వదులుతుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు విటమిన్‌ బి12 అవసరం.

కొత్త చర్మం తయారీకి బి 12 అవసరం. రొమ్ము, పెద్దపేగు, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్‌ కేన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. పాలు, మాంసం, చేపలు, గుడ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు, కాలీఫ్లవర్‌, క్యాబేజీ మొదలైన ఆహారపదార్థాల్లో విటమిన్‌ బి12 పుష్కలంగా ఉంటుంది. సాల్మన్ చేపను ఆహారంలో తీసుకుంటే బి12 శరీరానికి అవసరమైన మొత్తంలో అందుతుంది. గుడ్లలో ప్రోటీన్‌తో పాటు విటమిన్ బి -12 కూడా ఉంటుంది. కోడిగుడ్డు తెల్లసొనలో కన్నా పచ్చసొనలో అధిక మొత్తంలో విటమిన్ బీ 12 ఉంటుంది.

Tags:    

Similar News