Pregnancy: గర్భధారణ సమయంలో డిప్రెషన్ వద్దు.. పుట్టబోయే బిడ్డకు ప్రమాదం..

Pregnancy: గర్భధారణ సమయంలో స్త్రీ శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి

Update: 2021-11-14 15:52 GMT

గర్భధారణ సమయంలో డిప్రెషన్ వద్దు.. పుట్టబోయే బిడ్డకు ప్రమాదం.. (ఫైల్ ఇమేజ్)

Pregnancy: గర్భధారణ సమయంలో స్త్రీ శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పుల మధ్య ఒత్తిడి, కోపం, మూడ్ స్వింగ్స్ వంటి లక్షణాలు స్త్రీలో తరచుగా కనిపిస్తాయి. ఈ లక్షణాలు తక్కువగా ఉంటే పర్వాలేదు. కానీ అవి మరింతగా పెరిగితే డిప్రెషన్‌కి వెళుతారు. ఈ డిప్రెషన్ కొన్ని వారాలు లేదా నెలల పాటు కొనసాగుతుంది. కానీ అది తీవ్రంగా మారితే తల్లి, బిడ్డ ఇద్దరికీ ఇబ్బందిగా మారుతుంది. అధిక ఒత్తిడి కారణంగా చాలా సార్లు డెలివరీ సమయంలో అనేక రకాల సమస్యలు ఉండవచ్చు. దీంతో పాటు పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం పడుతుంది.

డిప్రెషన్ లక్షణాలు

1. వర్ణించలేని ఏడుపు, కోపం, చిరాకు

2. నిద్రలేమి

3. ఎప్పుడు అలసిపోయినట్లు అనిపించడం

4. జ్ఞాపకశక్తి బలహీనంగా అనిపించడం, అపరాధ భావన, ఆత్మహత్య గురించి ఆలోచనలు.

ఇవి పాటించాలి..

1. డిప్రెషన్‌ని అధిగమించడానికి తొమ్మిది గంటల పాటు నిద్రించాలి. ప్రెగ్నెన్సీ కారణంగా నిద్ర పూర్తి కాకపోతే గంటలు గంటలుగా పూర్తి చేయండి. నిద్ర పూర్తి అయితే మనస్సు రిలాక్స్‌ అవుతుంది. ప్రతికూల భావోద్వేగాలు తక్కువగా అనిపిస్తాయి.

2. ఉదయం, ఖచ్చితంగా కొంత సమయం పాటు ఎండలో కూర్చోండి. దీంతో మీరు విటమిన్ డి పొందుతారు. డిప్రెషన్ కూడా తగ్గుతుంది. పిల్లల ఎముకల అభివృద్ధికి విటమిన్ డి చాలా ముఖ్యమైనది.

3. మీ మనసును మళ్లించడానికి మిమ్మల్ని మీరు ఏదో ఒక కార్యకలాపంలో లేదా ఇతర పనులలో బిజీగా ఉంచుకోండి. మీకు పాడటం, సంగీత వాయిద్యాలు వాయించడం, స్కెచింగ్, పెయింటింగ్ మొదలైనవాటిలో ఏది ఇష్టమో ఆ పని చేయండి.

4. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కొంత సమయం పాటు వాకింగ్ చేయండి. అలాగే యోగా, ధ్యానాన్ని మీ దినచర్యలో భాగం చేసుకోండి. నిపుణుల సలహాతో గర్భధారణ సమయంలో యోగా చేయండి.

5. సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే నిపుణుడిని సంప్రదించండి, తద్వారా ఆ సమస్యను సకాలంలో నియంత్రించవచ్చు.

Tags:    

Similar News