Coffee: కాఫీ తాగేముందు ఇవి తినవద్దు.. ఎందుకంటే..?

Coffee: కొంతమందికి కాఫీ అంటే చాలా ఇష్టం. అందుకే రోజులో చాలాసార్లు తాగుతారు.

Update: 2022-05-15 14:45 GMT

Coffee: కాఫీ తాగేముందు ఇవి తినవద్దు.. ఎందుకంటే..?

Coffee: కొంతమందికి కాఫీ అంటే చాలా ఇష్టం. అందుకే రోజులో చాలాసార్లు తాగుతారు. అయితే కాఫీ తాగడానికి ముందు కొన్ని ఆహార పదార్థాలు తినకూడదు. దీనివల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాఫీకి తాగడానికి ముందు కాల్షియం ఉండే ఆహారాలకి దూరంగా ఉండాలి. అలాగే కాఫీకి ముందు నూనె ఆహారాలకి దూరంగా ఉండాలి. లేదంటే గ్యాస్ సమస్య ఏర్పడుతుంది. అందుకే అలాంటి తప్పు చేయకండి.

జింక్ ఉన్న పదార్థాలని కూడా కాఫీకి ముందు తినకూడదు. దీనివల్ల శరీరానికి హానికరం. దీంతో పాటు కాఫీ తాగే ముందు ఐరన్-రిచ్ ఫుడ్స్ తీసుకోవద్దు. ఇది మీ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది. అంటే బఠానీలు, కాయలు, పప్పులు, శనగలు లేదా చిక్‌పీస్‌లను తినకూడదు. అలాగే విటమిన్-డి పదార్థాలకి కూడా దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే శరీరం పూర్తి ప్రయోజనాన్ని పొందలేదు.

కాఫీ నిద్ర నుంచి మేల్కొలిపే ఔషధంగా పనిచేస్తుందనే విషయం తెలిసిందే. అయితే, ఎక్కువ మోతాదులో కాఫీ తీసుకోవడం ద్వారా సెన్సిటివిటీ ఉన్నవారిలో బ్లడ్ ప్రెజర్తో పాటు హార్డ్ రేటు పెరుగుతుంది. ఇది క్రమంగా గుండె సమస్యలకు దారితీయడమే కాకుండా హృదయ సంబంధ వ్యాధుల తీవ్రతను పెంచుతుంది. ఇటువంటి దుష్ప్రభావాలకు లోనవ్వకుండా ఉండాలంటే తక్కువ మోతాదులో కాఫీ తీసుకోవడం మంచిది.

Tags:    

Similar News