Health Tips: మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ 4 ఆహారాలను తప్పనిసరిగా తినాలి.. అవేంటంటే..?

Health Tips: చాలా సంవత్సరాల క్రితమే భారతదేశంలో అడుగుపెట్టిన మధుమేహం ప్రస్తుత కాలంలో పెద్ద సమస్యగా మారింది.

Update: 2023-03-12 05:43 GMT

Health Tips: మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ 4 ఆహారాలను తప్పనిసరిగా తినాలి.. అవేంటంటే..?

Health Tips: చాలా సంవత్సరాల క్రితమే భారతదేశంలో అడుగుపెట్టిన మధుమేహం ప్రస్తుత కాలంలో పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్య జన్యుపరంగా మాత్రమే కాదు సరైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల కూడా సంభవిస్తుంది. మధుమేహం మూత్రపిండాల వ్యాధి, గుండె జబ్బులు, అధిక బీపీ, స్ట్రోక్ వంటి అనేక ఇతర సమస్యలకు కారణమవుతుంది. అయితే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని తినడం వల్ల రక్తంలో అధిక చక్కెర నియంత్రణలో ఉంటుంది. అలాంటి ఆహారాల గురించి తెలుసుకుందాం.

1. బ్రోకలీ

ప్రతి ఆకుపచ్చ కూరగాయ ఆరోగ్యానికి మంచిదే. అయితే బ్రోకలీని సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. దీన్ని రెగ్యులర్‌గా తింటే బ్లడ్‌ షుగర్‌ లెవెల్‌, బీపీ కంట్రోల్‌లో ఉండి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

2. తృణధాన్యాలు

మన రోజువారీ ఆహారంలో తృణధాన్యాలు తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్‌ చేయాలంటే పాలిష్ చేసిన బియ్యానికి బదులుగా బ్రౌన్ రైస్, సాధారణ గోధుమ పిండికి బదులుగా ఫైబర్‌ కంటెంట్‌ అధికంగా ఉండే తృణధాన్యాలు తీసుకోవాలి.

3. గుడ్డు

సాధారణంగా అల్పాహారంలో కనీసం ఒక గుడ్డు తింటే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభమవుతుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ పరిమాణాన్ని నియంత్రిస్తుంది. గుడ్డులో డయాబెటిక్ పేషెంట్లకు అవసరమైన ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి.

4. పప్పులు

మన దైనందిన జీవితంలో పప్పులు ఒక ముఖ్యమైన ఆహారం. దీనిని అన్నం, రోటీ రెండింటిలో తినవచ్చు. అయితే ఇది డయాబెటిక్ రోగులకు ఎంతో మేలు చేస్తుంది. నిజానికి పప్పులు ప్రోటీన్, ఫైబర్‌కి గొప్ప మూలం. ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని ఎన్నో పరిశోధనలలో తేలింది.

Tags:    

Similar News