Health Tips: డయాబెటీస్‌ పేషెంట్లు ఈ రైస్‌ తినవచ్చు.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు..!

Health Tips: భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎక్కువగా మధుమేహం బారినపడుతున్నారు.

Update: 2023-02-15 08:00 GMT

Health Tips: భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎక్కువగా మధుమేహం బారినపడుతున్నారు. ఒక్కసారి ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ వస్తే డైట్ మొత్తం మారిపోతుంది. ఎల్లప్పుడు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవాలి. ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాలి. చాలామంది డయాబెటిక్ పేషెంట్లు వైట్ రైస్ తినడం మానేస్తారు. కానీ ఇందుకు ప్రత్యామ్నాయంగా మిల్లెట్‌ రైస్‌ని (చిరు ధాన్యపు గింజలు)తినవచ్చు.

బ్లడ్ షుగర్ అదుపులో

మిల్లెట్ రైస్ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడమే కాకుండా బరువు, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుందని అనేక పరిశోధనలలో తేలింది. టైప్-2 డయాబెటిస్ రోగులకు ఇది సరైన ఆహారం. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఎల్లప్పుడు మిల్లెట్ రైస్ తినాలి. సజ్జలు, రాగులు, జొన్నలు, కొర్రలు, ఊదలు మొదలైనవి వీటికిందకి వస్తాయి.

మిల్లెట్ రైస్‌లో లభించే పోషకాలు

మిల్లెట్ రైస్‌ను పోషకాల నిల్వగా పరిగణిస్తారు. దీనిని క్రమం తప్పకుండా తినే వ్యక్తులు అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి దూరంగా ఉంటారు. ఒక కప్పు వండిన మిల్లెట్ రైస్‌లో ఎలాంటి పోషకాలు ఉంటాయో తెలుసుకుందాం.

కేలరీలు: 207

పిండి పదార్థాలు: 41 గ్రా

ఫైబర్: 2.2 గ్రా

ప్రోటీన్: 6 గ్రా

కొవ్వు: 1.7 గ్రా

భాస్వరం: 25% రోజువారీ అవసరం

మెగ్నీషియం: 19% రోజువారీ అవసరం

ఫోలేట్: 8% రోజువారీ అవసరం

ఐరన్: 6% రోజువారీ అవసరం

మిల్లెట్ రైస్ ఎలా తయారు చేయాలి?

మిల్లెట్ రైస్ వండడానికి ముందుగా మిల్లెట్స్‌ని శుభ్రమైన నీటితో కడగాలి. ఒక గిన్నెలో వేసి 3 కప్పుల నీళ్లు పోయాలి. గ్యాస్ స్టవ్ మీద మీడియం మంట పెట్టి సుమారు 30 నిమిషాలు ఉడికించాలి. నీరు పూర్తిగా ఆరిపోయాక ప్లేట్‌లో వేసుకొని తినవచ్చు.

Tags:    

Similar News