Dark Circles: ఒత్తిడి వల్ల డార్క్‌ సర్కిల్స్‌.. తక్షణ ఉపశమనం కోసం ఇలా చేయండి..!

Dark Circles: ఈ రోజుల్లో చాలామంది డార్క్‌ సర్కిల్స్‌, వాపు సమస్యలతో బాధపడుతున్నారు.

Update: 2022-11-23 03:51 GMT

Dark Circles: ఒత్తిడి వల్ల డార్క్‌ సర్కిల్స్‌.. తక్షణ ఉపశమనం కోసం ఇలా చేయండి..!

Dark Circles: ఈ రోజుల్లో చాలామంది డార్క్‌ సర్కిల్స్‌, వాపు సమస్యలతో బాధపడుతున్నారు. ఎందుకంటే ప్రజల జీవితం ఒత్తిడితో నిండిపోయింది. కొందరికి చదువుల టెన్షన్, మరికొందరికి ఉద్యోగం, కొందరికి ఫ్యామిలీ టెన్షన్. ఈ బాధలన్నీ దాచుకోవాలని ఎంత ప్రయత్నించినా మన ముఖంలో డార్క్‌ సర్కిల్స్‌ ద్వారా కనిపిస్తూనే ఉంటాయి. కంప్యూటర్ స్క్రీన్ చూడటం వల్ల, వయసు పెరగడం వల్ల కూడా చాలా మందికి డార్క్ సర్కిల్స్ సమస్య ఉంటుంది. మీరు వీటిని వదిలించుకోవాలనుకుంటే కొన్ని ఇంటి నివారణలు ఉపయోగకరంగా ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.

బంగాళదుంప రసం

నల్లటి వలయాలను తొలగించడానికి బంగాళదుంప రసం ఉత్తమ మార్గం. బంగాళాదుంప చిన్నగా తురుముకొని కళ్ల కింద ఉంచి 15 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత కడిగితే మొదటి సారి నుంచే ప్రభావం కనిపిస్తుంది. ఈ చిట్కాని కొన్ని రోజులు నిరంతరంగా ఉపయోగిస్తే నల్లటి వలయాలు పూర్తిగా అదృశ్యమవుతాయి.

కళ్ల కింద మసాజ్

కళ్ల కింద మసాజ్ చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ సమస్య తొలగిపోతుంది. కొబ్బరి నూనెతో కళ్ల కింద మసాజ్ చేయాలి. అంతేకాదు తేనెను కళ్ల కింద అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల కూడా మేలు జరుగుతుంది. విటమిన్-ఇతో మసాజ్ చేయడం కూడా ప్రయోజనకరం. ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే నల్లటి వలయాలు తొలగిపోతాయి.

నిమ్మ, టమోటా

నిమ్మ, టొమాటో కూడా నల్లటి వలయాల సమస్యను దూరం చేయడంలో పనిచేస్తాయి. టొమాటోను గ్రైండ్ చేసి దాని రసాన్ని తీయాలి. అందులో నిమ్మరసం పిండుకుని కళ్ల కింద రాసుకోవాలి. కళ్ల చర్మం బిగుతుగా మారి నల్లటి వలయాలు తొలగిపోతాయి.

దోసకాయ

నల్లటి వలయాలను తొలగించడానికి దోసకాయ ఉపయోగకరంగా ఉంటుంది. దోసకాయను కోసి కళ్లపై మర్దన చేసి కొద్దిసేపు అలాగే ఉంచాలి. డార్క్ సర్కిల్స్‌లో ఉపశమనం లభిస్తుంది.

మాయిశ్చరైజర్

కళ్లలో వాపు సమస్య మాయిశ్చరైజేషన్ లేకపోవడం వల్ల వస్తుంది. కళ్ల కింద మాయిశ్చరైజర్ లేదా ఏదైనా క్రీమ్ రాయాలి. దీంతో కళ్ల చర్మం ఆరోగ్యవంతంగా ఉండడంతో పాటు సమస్య దూరమవుతుంది.

Tags:    

Similar News