Blood Moon: ఆకాశంలో రెడ్ కలర్‌లో జాబిల్లి, అందరినీ మంత్రముగ్ధులను చేసే ప్రత్యేక గ్రహణం
చంద్రుడు సాధారణంగా మనకు తెల్లవర్ణంలో కనిపిస్తాడు. కానీ చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తే అది బ్లడ్ మూన్‌గా ప్రసిద్ధి చెందుతుంది. 2025 సెప్టెంబర్ 7-8 రాత్రి ఈ అద్భుత దృశ్యం చూడనుంది. NASA ప్రకారం, ఈ గ్రహణం ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తుంది.

బ్లడ్ మూన్ ప్రత్యేకత:
ఇది ఈ ఏడాది రెండవ సంపూర్ణ చంద్రగ్రహణం.
హార్వెస్ట్ మూన్‌గా వస్తుంది.
చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా (పెరిజీ) ఉండే సమయంలో బ్లడ్ మూన్ కనిపిస్తుంది. అందువల్ల చంద్రుడు సాధారణం కంటే పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
చంద్రగ్రహణం అంటే ఏమిటి:
సూర్యుడు, చంద్రుడు మధ్య భూమి ఉన్నప్పుడు ఏర్పడే ఫెనామనాన్. ఈ సమయంలో భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. భూమి వాతావరణం ద్వారా వచ్చిన సూర్యకాంతి చంద్రుడిని ఎరుపు, నారింజ వర్ణంలో కన్పించే విధంగా ఉంటుంది.
భారతదేశంలో గ్రహణ సమయం:
రాత్రి 11:00 – 12:22 (IST)
సంపూర్ణ గ్రహణం 17:30 – 18:52 (82 నిమిషాలు, UTC)
ఎక్కడ స్పష్టంగా చూడవచ్చు:
చైనా, థాయ్‌లాండ్, జపాన్, ఇరాన్, వెస్ట్రన్ ఆస్ట్రేలియా వంటి దేశాల్లో స్పష్టంగా కనిపిస్తుంది.
బైనాక్యులకర్స్ లేదా ప్రత్యేక పరికరాలు అవసరం లేకుండా కూడా ఆకాశంలో చూడవచ్చు.
బ్లడ్ మూన్ చూసేవారికి అందరి మనసును మంత్రముగ్ధం చేసుకునే అనుభూతి కలుగుతుంది.