Black Coffee Benefits: నల్లగా ఉందని చీప్‌గా చూడకండి.. డయాబెటిస్, బరువు తగ్గించేందుకు పవర్‌ఫుల్ డ్రింక్ ఇదే!
కాఫీ తాగడం వల్ల శరీరానికి ఉత్సాహం వస్తుందని అందరికీ తెలుసు. కానీ చాలా మంది పాలు, చక్కెర వేసి మాత్రమే కాఫీ తాగుతారు. అలా తాగితే రుచి బాగానే ఉంటుంది కానీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పంచదార – పాలు లేకుండా తాగే బ్లాక్ కాఫీ మాత్రం నిజంగా ఆరోగ్యానికి మేలని నిపుణులు చెబుతున్నారు. చేదుగా ఉంటుందని దూరం పెట్టే బ్లాక్ కాఫీ అసలే శరీరానికి ఓ పవర్‌ఫుల్ డ్రింక్!

బ్లాక్ కాఫీలో ఏముంది?
బ్లాక్ కాఫీలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, కెఫిన్ వంటి ముఖ్యమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇవన్నీ కలసి శరీరానికి అనేక విధాలుగా ఉపయోగపడతాయి.
బ్లాక్ కాఫీ తాగడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు
శరీరానికి వెంటనే శక్తి
అలసటగా, నీరసంగా అనిపించినప్పుడు బ్లాక్ కాఫీ తాగితే శరీరం ఫ్రెష్‌గా మారుతుంది. తక్షణ శక్తిని అందిస్తుంది.
బరువు తగ్గించడంలో సహాయం
డార్క్ కాఫీ జీవక్రియ (Metabolism)ని వేగవంతం చేస్తుంది. దీంతో కేలరీలు త్వరగా ఖర్చవుతాయి. అదనపు కొవ్వు కూడా కరుగుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.
మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది
కాఫీలోని కెఫిన్ మెదడు కణాలను ఉత్తేజపరుస్తుంది. జ్ఞాపకశక్తి, దృష్టి పెరుగుతాయి. అలాగే ఒత్తిడి తగ్గుతుంది, మూడ్ బాగుంటుంది.
డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
బ్లాక్ కాఫీ తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. క్రమం తప్పకుండా బ్లాక్ కాఫీ తాగడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.
కాబట్టి, నల్లగా ఉందని బ్లాక్ కాఫీని చిన్నచూపు చూడకండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో, బరువు తగ్గించడంలో, డయాబెటిస్‌కి దూరంగా ఉండడంలో ఇది ఓ సహజమైన, పవర్‌ఫుల్ డ్రింక్.