Betel Leaves: తమలపాకులు నోటి దుర్వాసనకి మాత్రమే కాదు ఈ సమస్యకి చక్కటి పరిష్కారం..!

Betel Leaves: నోటి దుర్వాసనని తగ్గించుకోవడానికి చాలామంది తమలపాకులు తింటారు.

Update: 2023-02-11 08:30 GMT

Betel Leaves: తమలపాకులు నోటి దుర్వాసనకి మాత్రమే కాదు ఈ సమస్యకి చక్కటి పరిష్కారం..!

Betel Leaves: నోటి దుర్వాసనని తగ్గించుకోవడానికి చాలామంది తమలపాకులు తింటారు. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన బ్యాక్టీరియా బయటకు వస్తుంది. తమలపాకులు నోటిని తాజాగా ఉంచడమే కాకుండా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి కాపాడుతాయి. వీటిలో యూరిక్ యాసిడ్ ఒకటి. నేటి కాలంలో ఈ వ్యాధి చాలా వేగంగా పెరుగుతోంది. అన్ని వయస్సుల వారు దీని బారిన పడుతున్నారు. తమలపాకులు యూరిక్ యాసిడ్ స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడుతాయి.

తమలపాకులు శరీరంలో ప్యూరిన్‌ను జీర్ణం చేయడంలో సహాయపడతాయి. అంతే కాకుండా గ్యాస్ట్రిక్ అల్సర్ కూడా నయమవుతుంది. తమలపాకులలో అనేక నిర్విషీకరణ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని మురికిని బయటకు తీయడంలో సహాయపడతాయి. యూరిక్ యాసిడ్‌తో బాధపడేవారు తమలపాకులతో చేసిన షర్బత్ తాగవచ్చు లేదా నేరుగా తినడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

పూర్వకాలంలో జలుబు, జ్వరం, ఛాతీ బిగువు, శ్వాసకోశ సమస్యల నుంచి బయటపడేందుకు తమలపాకులను ఉపయోగించేవారు. శ్వాసకోశ సమస్యల నుంచి విముక్తి పొందాలంటే తమలపాకులను లవంగం నీటిలో మరిగించి టీలాగా తాగాలి. ఇది మీకు చాలా వరకు ప్రయోజనం చేకూరుస్తుంది. తమలపాకులు తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇందుకోసం తమలపాకులను మెత్తగా చేసి తలపై పెట్టుకోవాలి.

Tags:    

Similar News