Increase Lung Capacity: ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పెంచుకోవాలంటే..

Increase Lung Capacity: ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే శ్వాసకి సంబంధించిన వ్యాయామాలు బాగా ఉపయోగ పడతాయి.

Update: 2021-05-27 10:27 GMT

Increase Lung Capacity: (File Image) 

Increase Lung Capacity: మధ్య కాలంలో మనం తరచుగా వింటున్నది శ్వాసకోశ సంబంధిత సమస్యలతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోవడం ఇలా అనేకమందిలో ఈ ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే శ్వాసకి సంబంధించిన వ్యాయామాలు బాగా ఉపయోగ పడతాయి. వీటి వల్ల ఊపిరితిత్తులు దృఢంగా ఉంటాయి తద్వారా శ్వాస సంబంధిత సమస్యలు కూడా ఉండవు. మరికొన్ని అంశాలను మన 'లైఫ్ స్టైల్' లో తెలుసుకుందాం.

శ్వాస కి సంబంధించిన వ్యాయామాలు చేయడం వల్ల మ్యూకస్ తగ్గిపోతుంది. ఇది ఎలాగా అనేది చూస్తే... శ్వాస కి సంబంధించిన వ్యాయామాలు చేయడం వల్ల ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇలా అది లంగ్స్ కి ఆక్సిజన్ చేరుకొని మ్యూకస్ మరియు ఇతర ఫ్లూయిడ్స్ ని కూడా తగ్గిస్తుంది కాబట్టి బ్రీథింగ్‌కి సంబంధించిన వ్యాయామాలు చేయడం వల్ల ఈ ప్రయోజనాలు కూడా మనం పొందొచ్చు.

మీరు శ్వాస తీసుకోవడానికి వ్యాయామాలు చేసేటప్పుడు పూర్తి దృష్టి దాని మీద పెడితే ఒత్తిడి తగ్గుతుంది. అదే విధంగా ఏకాగ్రతతో మీరు శ్వాస తీసుకుంటూ ఉంటే మీ ఊపిరితిత్తులు కూడా ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి. మీరు శ్వాస తీసుకునేటప్పుడు నెమ్మదిగా ముక్కు ద్వారా తీసుకోండి. మీ నోరుని మాత్రం పూర్తిగా మూసేయండి. ఇలా ముక్కు ద్వారా మీరు నెమ్మదిగా శ్వాస తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు చేరుకునే ముందే గాలి కాస్త వెచ్చగా మరియు హ్యుమిడిఫయర్ చేస్తుంది. కనుక ఇలా మీరు చెయ్యండి. దీనిలో నోటి యొక్క సహాయం మాత్రం మీరు తీసుకోవద్దు. ఇది అసలు మరిచిపోకండి.

మీరు బ్రీథింగ్ తీసుకునేటప్పుడు హమ్మింగ్ చేస్తూ ఉంటే ఎయిర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. సైనస్లో ఈ గాలి ఫ్లో ఎక్కువగా ఉండడం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ లెవల్స్‌ను పెంచుతుంది. ఈ గ్యాస్‌లో యాంటీ ఫంగల్ గుణాలు, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. కాబట్టి మీరు ఈ టెక్నిక్‌ని కూడా అనుసరిస్తే మీకు మంచి జరుగుతుంది.

శ్వాస అనేది ముక్కు నుండి మొదలవుతుంది. ఆ తర్వాత నిదానంగా మీ పొట్ట మీద ప్రభావం పడుతుంది. మీ పొట్ట కొంచెం ఎక్స్పాండ్ అయ్యి మీ ఊపిరితిత్తుల లోకి కూడా గాలి వెళ్తుంది. కాబట్టి మీరు పొట్ట సహాయం కూడా మధ్య లో తీసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే కూడా మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితి లో ఈ టిప్ ని కూడా మీరు మరచి పోకుండా అనుసరించడం చాల ముఖ్యం.

ఊపిరితిత్తులు చాలా సాఫ్ట్ గా ఉంటాయి. కనుక మీరు చాలా సరైన విధానంలో కూర్చోవాలి. వాటికి మీరు రూమ్‌ని కల్పించాలి. మీరు పొడుగ్గా కూర్చుని మీ యొక్క వెన్నుపూసని నిదానంగా ఉంచి శ్వాస తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల మీకు మంచి ప్రయోజనాలు ఉంటాయి.

కరోనా కారణంగా శ్వాస సంబంధిత సమస్యలు పెరిగి పోయాయి. ఇటువంటి శ్వాస సంబంధిత సమస్యలకు చెక్ పెట్టాలంటే కచ్చితంగా ఈ వ్యాయామ పద్ధతులు పాటించాలి. దాని కోసం ఈ టిప్స్ బాగా ఉపయోగ పడతాయి. శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేస్తే శారీరకంగా మరియు మానసికంగా కూడా ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చు.

Tags:    

Similar News