Dark Circles: డార్క్‌ సర్కిల్స్‌కి వీటితో చెక్.. అవేంటంటే..?

Dark Circles: నేటి రోజుల్లో చాలామంది డార్క్‌ సర్కిల్స్‌తో ఇబ్బంది పడుతున్నారు. వీటివల్ల ఒక్కోసారి బయటకి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి.

Update: 2022-07-19 11:30 GMT

Dark Circles: డార్క్‌ సర్కిల్స్‌కి వీటితో చెక్.. అవేంటంటే..?

Dark Circles: నేటి రోజుల్లో చాలామంది డార్క్‌ సర్కిల్స్‌తో ఇబ్బంది పడుతున్నారు. వీటివల్ల ఒక్కోసారి బయటకి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. కంప్యూటర్ ముందు కూర్చొని గంటల తరబడి పని చేయడం, సరిపడా నిద్ర పోకపోవడం, ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వంటి కారణాల వల్ల డార్క్‌ సర్కిల్స్‌ ఏర్పడుతాయి. అయితే వీటిని దాచుకోవడం అంత సులభం కాదు. మేకప్‌తో కొంత సమయం వరకు కనపడకుండా చేయవచ్చు. కానీ తర్వాత ఎలాగోలా కనిపిస్తాయి. మీరు డార్క్ సర్కిల్స్‌ని వదిలించుకోవాలంటే కొన్ని చిట్కాలని అనుసరించాలి. వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.

బంగాళదుంప రసం

బంగాళదుంపలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటి రసాన్ని డార్క్‌ సర్కిల్స్‌పై అప్లై చేయడం వల్ల క్రమంగా తగ్గుతాయి. ముందుగా బంగాళదుంపను సన్నగా తురుముకోవాలి. వాటి నుంచి బంగాళదుంప రసం తీసుకోవాలి. దూదితో బంగాళదుంప రసాన్ని కళ్ల కింద రాయాలి. ఇలా తరచుగా చేస్తూ ఉండాలి. మెల్లగా తగ్గుతూ ఉంటాయి.

కోల్డ్ టీ బ్యాగ్‌లు

టీ బ్యాగ్‌లలో కెఫిన్ ఉంటుంది. ఇది కళ్లకింద రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. తద్వారా డార్క్‌ సర్కిల్స్‌ తగ్గుతాయి. ఇందుకోసం ఉపయోగించిన గ్రీన్ టీ బ్యాగ్స్‌ని కొద్దిసేపు ఫ్రిజ్‌లో పెట్టి ఉపయోగించాలి.

చల్లని పాలు

చల్లటి పాలు చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఇవి డార్క్‌ సర్కిల్స్‌ని తొలగించడంలో ప్రబావవంతంగా పనిచేస్తాయి. ఇందుకోసం ఒక గిన్నెలో చల్లని పాలు తీసుకోవాలి. కాటన్ సాయంతో పాలను కళ్ల కింద రాసుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు అప్లై చేసి ఆపై చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా చేయడం వల్ల డార్క్‌ సర్కిల్స్‌ తగ్గుతాయి.

Tags:    

Similar News