Health Tips: బొప్పాయి గింజలని పారేస్తున్నారా.. ఈ ప్రయోజనాలు తెలిస్తే షాక్‌ అవుతారు..!

Health Tips: బొప్పాయిని చాలా మంది ఇష్టపడతారు. భారతదేశంలోని చాలా ఇళ్లలో ప్రజలు అల్పాహారంలో బొప్పాయిని తీసుకుంటారు.

Update: 2023-02-14 06:20 GMT

Health Tips: బొప్పాయి గింజలని పారేస్తున్నారా.. ఈ ప్రయోజనాలు తెలిస్తే షాక్‌ అవుతారు..!

Health Tips: బొప్పాయిని చాలా మంది ఇష్టపడతారు. భారతదేశంలోని చాలా ఇళ్లలో ప్రజలు అల్పాహారంలో బొప్పాయిని తీసుకుంటారు. ఈ పండు చర్మంతో సహా మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బొప్పాయి పండు రుచి, పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు అందరికీ తెలుసు. కానీ దాని గింజలు కూడా మనకు ఉపయోగకరంగా ఉంటాయని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. బొప్పాయి గింజల రుచి కొంచెం ఘాటుగా ఉంటుంది. అయితే వీటిని ఎండబెట్టి గ్రైండ్ చేసిన తర్వాత తీసుకోవాలి.

బొప్పాయి గింజల్లో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అదనంగా జింక్, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, కాల్షియంతో సహా అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. బొప్పాయి గింజలు మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఫ్లేవనాయిడ్‌లను కలిగి ఉంటాయి. ఇవి చాలా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఈ పోషక విలువలన్నీ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వ్యాధులను దూరం చేస్తాయి.

బరువు తగ్గడం

బొప్పాయి గింజలు జీర్ణశక్తిని పెంచుతాయి. శరీరం నుంచి మురికిని తొలగించడానికి పని చేస్తాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీవక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది.

పేగుల ఆరోగ్యం

బొప్పాయి గింజల్లో కార్పెన్ అనే పదార్థం ఉంటుంది. ఇది పేగుల్లోని పురుగులు, బ్యాక్టీరియాను చంపుతుంది. దీని కారణంగా జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్ధకం సమస్య ఉండదు.

కొలెస్ట్రాల్ నియంత్రణ

కొలెస్ట్రాల్ స్థాయిని బొప్పాయి గింజల ద్వారా నియంత్రించవచ్చు. ఒలీక్ యాసిడ్, ఇతర మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి

బొప్పాయి గింజల్లో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి శరీరాన్ని అనేక రకాల క్యాన్సర్‌ల నుంచి రక్షిస్తాయి.

మంటను తగ్గిస్తాయి

బొప్పాయి గింజల్లో విటమిన్ సి, ఇతర సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ వంటి వ్యాధులను నివారించడంలో, మంటను తగ్గించడంలో సహాయపడతాయి.

Tags:    

Similar News