Health Tips: ఎసిడిటీ, మలబద్దకంతో ఇబ్బందిపడుతున్నారా..!

Health Tips: ఈ రోజుల్లో జీవనశైలి, ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల చాలామంది మలబద్ధకం, అసిడిటీ సమస్యతో బాధపడుతున్నారు.

Update: 2022-08-27 12:00 GMT

Health Tips: ఎసిడిటీ, మలబద్దకంతో ఇబ్బందిపడుతున్నారా..!

Health Tips: ఈ రోజుల్లో జీవనశైలి, ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల చాలామంది మలబద్ధకం, అసిడిటీ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యలు అప్పుడప్పుడు వస్తే పర్వాలేదు కానీ రొటీన్‌గా మారితే మాత్రం ప్రమాదంగా భావించాలి. వీటిని ఎదుర్కోవటానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. వీటిని పాటించడం వల్ల మీ జీర్ణవ్యవస్థను బలోపేతం చేయవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

లవంగం,యాలకులు

మీరు చాలాకాలం కడుపులో ఉబ్బరం, మలబద్ధకం లేదా ఆమ్లత్వం కలిగి ఉంటే లవంగాలు, యాలకులని తీసుకోవాలి. ఇవి కార్మినేటివ్ లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిని ఉపయోగించడం వల్ల మీ యాసిడ్ రిఫ్లక్స్ మెరుగుపడుతుంది. మరోవైపు యాలకులు కడుపు వేడిని తగ్గిస్తాయి. మలబద్ధకం నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

గోరువెచ్చని నీరు

తేలికపాటి గోరువెచ్చని నీరు అన్ని వ్యాధులను నాశనం చేస్తుంది. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే 2 గ్లాసుల గోరువెచ్చని నీటిని తప్పనిసరిగా తాగాలి. మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ఈ గోరువెచ్చని నీరు అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. దీని వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోయి శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.

అల్లం

పొట్టను ఫిట్‌గా ఉంచడానికి మీరు సోంపు గింజలు, పుదీనా ఆకులు, అల్లం తీసుకోవచ్చు. కొంచెం నీరు తీసుకుని అందులో ఈ మూడు పదార్థాలను మరిగించాలి. తరువాత పరగడుపున తీసుకుంటే చాలా మంచిది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అల్లంలో జింజెరాల్ అనే ప్రత్యేక మూలకం ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. పుదీనా, సోంపు కూడా పొట్టను శుభ్రంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.

Tags:    

Similar News