Bad Cholesterol: ఈ వయసు తర్వాత చెడు కొలస్ట్రాల్‌ ప్రమాదం ఎక్కువ..!

Bad Cholesterol: కొలెస్ట్రాల్ శరీరానికి చాలా ముఖ్యమైనది. కానీ శరీరంలో దీని స్థాయి పెరిగితే అనేక సమస్యలకి కారణం అవుతుంది.

Update: 2022-09-19 06:30 GMT

Bad Cholesterol: ఈ వయసు తర్వాత చెడు కొలస్ట్రాల్‌ ప్రమాదం ఎక్కువ..!

Bad Cholesterol: కొలెస్ట్రాల్ శరీరానికి చాలా ముఖ్యమైనది. కానీ శరీరంలో దీని స్థాయి పెరిగితే అనేక సమస్యలకి కారణం అవుతుంది. వాస్తవానికి కొలెస్ట్రాల్ రెండు రకాలు. మంచి కొలెస్ట్రాల్ శరీరానికి అవసరం. చెడు కొలెస్ట్రాల్ శరీరానికి హాని చేస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌లో కొవ్వు కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కానీ చెడు కొలెస్ట్రాల్‌లో ఎక్కువగా కొవ్వు ఉంటుంది. ఇక్కడ చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు అది సిరల్లో రక్త సరఫరాకి ఆటంకం కలిగిస్తుంది. దీని కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

మీరు ఏది తిన్నా అది కొలెస్ట్రాల్ స్థాయిని ప్రభావితం చేస్తుంది. ప్రాసెస్ చేసిన మాంసం, గొడ్డు మాంసం, పంది మాంసం వంటివి అధిక సంతృప్త కొవ్వులు ఉన్న ఆహారాలు. వాటిని తినడం వెంటనే మానేయాలి. చెడు కొలెస్ట్రాల్‌ను సరైన సమయంలో నియంత్రించకపోతే స్ట్రోక్, గుండెపోటు, ఛాతీ నొప్పి, కిడ్నీ సమస్యలు వంటి అనేక వ్యాధులు సంభవిస్తాయి. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి ఆహారంలో కొన్ని మార్పులు చేయాలి. ప్రతిరోజు డైట్‌లో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, విత్తనాలు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి.

20 ఏళ్ల వయసు దాటారంటే కొలస్ట్రాల్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల ప్రకారం, కొలెస్ట్రాల్ స్థాయిని సంవత్సరానికి కనీసం రెండుసార్లు తనిఖీ చేసుకోవాలి. ప్రస్తుతం పెద్దలు కూడా అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. చెడు కొలస్ట్రాల్‌ వల్ల చాలామంది చిన్న వయసులోనే గుండెపోటుకి గురవుతున్నారు. మాంసాహారం తగ్గించి ఎక్కువగా కూరగాయాలు తీసుకోవడం ఉత్తమం.

Tags:    

Similar News