Wrinkles: కళ్ల కింద ముడతలు నయం కావాలంటే ఇవి తినాల్సిందే..!

Wrinkles: కళ్ళు మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం.

Update: 2022-10-09 06:30 GMT

Wrinkles: కళ్ల కింద ముడతలు నయం కావాలంటే ఇవి తినాల్సిందే..!

Wrinkles: కళ్ళు మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. అయితే శరీరంలో బలహీనత వల్ల కళ్లకింద ముడతలు వస్తాయి. అంతేకాదు తగినంత నిద్ర లేకపోవడం, సరిగ్గా తినలేకపోవడం, పౌష్టికాహారం కొరత, డీహైడ్రేషన్‌కు వంటి కారణాల వల్ల కళ్లపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. దీనివల్ల కళ్ల కింద ముడతలు ఏర్పడుతాయి. ఈ పరిస్థితిలో రోజువారీ డైట్‌లో కొన్ని ఆహారాలని చేర్చుకోవాలి. అప్పుడు ముడతల సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. అటువంటి వాటి గురించి తెలుసుకుందాం.

1. నీరు

శరీరం ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండటం ముఖ్యం. దీని వల్ల అనేక వ్యాధులకి దూరంగా ఉంటాం. అయితే శరీరంలో సరిపడ నీరు లేకుంటే కళ్ళ కింద ముడతలు సంభవిస్తాయి. అలాగే కళ్లలో వాపు, కళ్ళు పొడిబారడం వంటి సమస్యలు ఏర్పడుతాయి. అందుకే ఎప్పుడు తగినంత నీరు తీసుకోవాలి.

2. పచ్చి కూరగాయలు

ఆకు కూరలు శరీరానికి చాలా ముఖ్యమైనవి. అనేక రకాల పోషక మూలకాలు ఇందులో ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పచ్చి కూరగాయలలో ఉండే లుటిన్, జియాక్సంతిన్ కళ్లకు మేలు చేస్తాయి. చర్మానికి మెరుపును తీసుకురావడానికి పని చేస్తాయి. అందువల్ల ఆకుకూరలు డైట్‌లో ఉండే విధంగా చూసుకోవాలి.

3. క్యారెట్లు

క్యారెట్లు చాలా పోషకమైన ఆహారం. వీటిలో బీటా కెరోటిన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కళ్ల కింద ముడతలని తొలగించడంలో విటమిన్లు ప్రభావవంతంగా పనిచేస్తాయి. దీని వినియోగం వల్ల కళ్లలో కాంతి పెరుగుతుంది. అలాగే ఇందులో ఉండే పోషకాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి.

Tags:    

Similar News