Health Tips: ఈ చిన్న పొరపాటు గుండెపోటుకి కారణం.. అందుకే ఈ గింజలు తినాలి..!

Health Tips: ఈ రోజుల్లో గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

Update: 2022-11-15 03:41 GMT

Health Tips: ఈ చిన్న పొరపాటు గుండెపోటుకి కారణం.. అందుకే ఈ గింజలు తినాలి..!

Health Tips: ఈ రోజుల్లో గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఫిట్‌నెస్ కాన్షియస్‌గా ఉన్నప్పటికీ గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. గుండెపోటుకు అతి పెద్ద కారణం కొలెస్ట్రాల్. శరీరంలో ఇది ఎక్కువైనప్పుడు చాలామంది దీనిపై శ్రద్ధ పెట్టరు. గుండెపోటును నివారించాలనుకుంటే కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం కచ్చితంగా అవసరం. మన డైట్‌లో కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలని చేర్చడం వల్ల కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చు.

కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి..?

కొలెస్ట్రాల్‌కు కారణం తప్పుడు ఆహారపు అలవాట్లు. దీనిని అదుపులో ఉంచుకోవాలంటే ఆరోగ్యకరమైన వాటిని డైట్‌లో చేర్చుకోవాలి. అవిసె గింజలు చాలా ఆరోగ్యకరమైనవి. ఈ విత్తనాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో పనిచేస్తాయి. అవిసె గింజల్లో ఫైబర్, ఒమేగా-3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు, కరిగే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఫ్లాక్స్ సీడ్స్‌లో ఉండే పోషకాలు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

అవిసె గింజలను ఎలా తినాలి..?

అధిక కొలెస్ట్రాల్‌ను నివారించాలనుకుంటే రోజువారీ ఆహారంలో అవిసెగింజలని చేర్చుకోవాలి. వీటిని పచ్చిగా తినకూడదు వేయించి తీసుకోవాలి. కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఒక చెంచా అవిసెగింజలు సరిపోతాయి. వీటిని వేయించిన తర్వాత హల్వా లేదా లడ్డూలలో కలుపుకుని తినవచ్చు. అవిసెగింజలలో చాలా పోషకాలు ఉంటాయి. కానీ అవి కొంతమందికి హాని కలిగిస్తాయి. అలెర్జీ, వాపు ఉన్నవారు తినకూడదు. ఇందులో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది, ఇది మూత్రపిండాల రోగులకు హాని కలిగిస్తుంది. అందువల్ల అవిసె గింజలను తీసుకునే ముందు ఆరోగ్యంగా ఉండటం అవసరం.

Tags:    

Similar News