Working Hours: వారానికి 60 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే ఆరోగ్య సమస్యలు
Working Hours: వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కోరారు.
Working Hours: వారానికి 60 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే ఆరోగ్య సమస్యలు
Working Hours: వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కోరారు. ఇదే వాదనను సమర్థిస్తూ ఎల్ అండ్ టీ సంస్థ చైర్మన్ సుబ్రమణ్యం ఆదివారాల్లో కూడా పనిచేయాలని సూచించారు. అయితే రోజుకు 8 గంటల కంటే ఎక్కువ సేపు పనిచేస్తే ఏం జరుగుతోంది? నిపుణులు ఏం చెప్పారు? భారత ఆర్ధిక సర్వే దీనికి సంబంధించిన కీలక వివరాలను బయటపెట్టింది.
వారానికి 60 గంటల కంటే ఎక్కువ పని చేస్తే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఎకనామిక్ సర్వే వెల్లడించింది. ఆఫీసులో రోజుకు 12 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం గడిపే ఉద్యోగుల్లో మానసిక రుగ్మతలు వస్తాయని కూడా ఈ సర్వే వివరించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐఎల్ఓ సంస్థల అధ్యయనాల ప్రకారంగా వారానికి 55 నుంచి 60 పని గంటలు దాటితే ఆ ఉద్యోగి ఆరోగ్యంపై భారం పడుతుందని నివేదికలు చెబుతున్నాయి. ఆర్ధిక సర్వే కూడా ఇదే విషయాన్ని తెలిపింది.
ప్రతి రోజూ రోజుకు 12 గంటలు అంతకంటే ఎక్కువ సమయం పనిచేసే ఉద్యోగుల మానసిక స్థితి ఇతరుల కంటే 100 పాయింట్లు తక్కువగా ఉంటుందని ఈ నివేదిక తెలిపింది.
నెలకు కనీసం రెండు మూడు రోజులు ఫ్యామిలీ మెంబర్లతో గడపడం వల్ల ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చు. ఉద్యోగులపై ఒత్తిడి, ఆందోళన భారీ నష్టానికి దారితీసే అవకాశం ఉందని ఆర్ధిక సర్వే తెలిపింది.