Heart Attack: గుండెపోటుకి ముందు ఈ సంకేతాలు.. అస్సలు విస్మరించకండి..!

Heart Attack: గుండెను ఫిట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అది అన్ ఫిట్ అయితే జీవితాంతం మందుల మీదే ఆధారపడాల్సి ఉంటుంది.

Update: 2022-04-04 06:30 GMT

Heart Attack: గుండెపోటుకి ముందు ఈ సంకేతాలు.. అస్సలు విస్మరించకండి..!

Heart Attack: గుండెను ఫిట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అది అన్ ఫిట్ అయితే జీవితాంతం మందుల మీదే ఆధారపడాల్సి ఉంటుంది. అందుకే తినే ఆహారం, వ్యాయామంపై శ్రద్ధ పెట్టండి. ముఖ్యంగా ఒత్తిడికి లోనుకాకండి. ఇది గుండెపోటుకు కారణమవుతుంది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెపోటు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే గుండెపోటు రావడానికి ముందు శరీరంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వాటి గురించి తెలుసుకుందాం.

ఛాతీలో అసౌకర్యం ఉంటే తేలికగా తీసుకోకండి. ఎందుకంటే ఛాతీ నొప్పి, బిగుతు, ఒత్తిడి అనేవి గుండెపోటు లక్షణాలు కావచ్చు. కానీ ఒక్కోసారి ఛాతీ నొప్పి లేకుండా కూడా గుండెపోటు సంభవించవచ్చు. అంతే కాకుండా ఆయాసం, అజీర్తి, కడుపునొప్పి వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. మీరు గుండె జబ్బుతో ఉన్నప్పుడు అలసిపోయినట్లు భావిస్తారు. ఈ పరిస్థితిలో కడుపు నొప్పి కూడా ఏర్పడవచ్చు. ఇవి కాకుండా శరీరం ఎడమ వైపున నొప్పి ఉంటుంది. ఈ పరిస్థితిలో నొప్పి ఛాతీ నుంచి మొదలవుతుంది. నొప్పి దిగువ భాగంలో పెరుగుతుంది.

తల తిరగడం కూడా గుండె వైఫల్యానికి సంకేతం. డీ హైడ్రేషన్‌ వల్ల మైకం వచ్చి గుండె పనిచేయదు. గొంతు లేదా దవడలో నొప్పి కూడా గుండెపోటుకు సంకేతం. అయితే అన్ని నొప్పులు గుండెనొప్పులకి కారణమని చెప్పలేం. కొన్నిసార్లు ఇది జలుబు లేదా సైనస్ కారణంగా వస్తుంది. కానీ కొన్నిసార్లు ఛాతీ నొప్పి గొంతు నుంచి దవడకు వ్యాపిస్తుంది. ఇది చాలా ప్రమాదం. మీరు చాలా త్వరగా అలసిపోయినట్లనిపిస్తే బలహీనతగా భావించకండి. ఎందుకంటే ఇది కూడా గుండెపోటుకు కారణమయ్యే లక్షణాలలో ఒకటని గుర్తుంచుకోండి.

ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ పాఠకులని ఉద్దేశించి రాయడం జరిగింది. వీటిని పాటించేముందు ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. hmtv దీన్ని ధృవీకరించదని గుర్తుంచుకోండి. 

Tags:    

Similar News