ఈరోజు (మే-15 - శుక్రవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-05-15 00:34 GMT
Live Updates - Page 2
2020-05-15 03:50 GMT

బ్రేకింగ్ : మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అస్వస్థత

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అర్థరాత్రి అస్వస్థతకు గురయ్యారు. ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సబితా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మంత్రి సబితా ఆరోగ్యంపై పలువురు మంత్రులు, నేతలు.. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.

2020-05-15 02:38 GMT

వైజాగ్ గ్యాస్ లీక్ : వైద్య శిబిరాలు

 ఆంధ్రప్రదేశ్:  విశాఖపట్నం గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లో 6 చోట్ల వైద్య శిబిరాలు..

- మరో వారం రోజుల్లో వైఎస్ఆర్ క్లినిక్ పేరిట ప్రత్యేక వైద్యశాల..

- గోపాలపట్నం ఏరియా ఆస్పత్రిలో 10 వెంటిలేటర్లతో వైద్య సదుపాయాలు

- ప్రతి వ్యక్తికి 5 రకాల పరీక్షలు చేయాలని వైద్య నిపుణుల కమిటీ నిర్ణయం..



 



2020-05-15 02:27 GMT

నేడు కరోనా నియంత్రణ, లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష..

మ.2 గంటలకు కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణలో సమగ్ర వ్యవసాయ విధానంపై చర్చ జరగనుంది.

2020-05-15 02:26 GMT

నేడు రైతుల ఖాతాల్లో వైఎస్ఆర్‌ రైతు భరోసా నగదు జమ

- నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్

- తొలివిడతగా నేడు రైతుల ఖాతాల్లోకి రూ.2,800 కోట్లు జమ..

- ప్రతి రైతు కుటుంబానికి తొలివిడతగా రూ.7,500 జమ..

- ఈసారి 49.43 లక్ష కుటుంబాలకు పెట్టుబడి సాయం..

- ఎన్నికల హామీ మేరకు వరుసగా రెండో ఏడాది అన్నదాతలకు సాయం..



 


2020-05-15 01:48 GMT

ఈ నెల 16వ తేదీ నుండి హైదరాబాద్ నుంచి ఏపీకి బస్సులు

లాక్‌డౌన్ ప్రభావంతో హైదరాబాద్‌లో ఇరుకున్న ఏపీ వాసులను రాష్ట్రానికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు

ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ప్రయాణానికి వెసులుబాటు

స్వస్థలాలకు చేరుకున్న తర్వాత సంబంధిత జిల్లాలో ఉండే క్వారంటైన్‌ కేంద్రంలో ఉంటామని అంగీకరిస్తేనే టికెట్లు జారీ

2020-05-15 01:09 GMT

దిశ చట్టం పటిష్టంగా అమలయ్యేలా చూడాలి

'దిశ' అమలు కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకోవాలని వాటిని వీలైనంత త్వరగా కొనుగోలు చెయ్యాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. 'దిశ'పై సీఎం జగన్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి హోం మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌, దిశ ప్రత్యేక అధికారులు కృతికా శుక్లా, దీపికా పాటిల్‌ తదితరులు హాజరయ్యారు. 

-మరిన్ని వివరాలు 

2020-05-15 01:01 GMT

తెలంగాణా: కౌలాలంపూర్ నుంచి దేశానికి వస్తున్నవారితో ఎయిర్ ఇండియా విమానం హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు నిన్న రాత్రి 10 గంటలకు చేరుకుంది. ఈ విమానం ద్వారా 117 మంది ప్రయాణీకులు స్వదేశానికి చేరుకున్నారు.


 




.

Tags:    

Similar News