'దిశ' చట్టాన్ని పటిష్టంగా అమలు అయ్యేలా చూడండి : సీఎం జగన్ ఆదేశం

దిశ చట్టాన్ని పటిష్టంగా అమలు అయ్యేలా చూడండి : సీఎం జగన్ ఆదేశం
x
Highlights

'దిశ' అమలు కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకోవాలని వాటిని వీలైనంత త్వరగా కొనుగోలు చెయ్యాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. 'దిశ'పై...

'దిశ' అమలు కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకోవాలని వాటిని వీలైనంత త్వరగా కొనుగోలు చెయ్యాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. 'దిశ'పై సీఎం జగన్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి హోం మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌, దిశ ప్రత్యేక అధికారులు కృతికా శుక్లా, దీపికా పాటిల్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యంగా దిశ చట్టం ఆమోదం, ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం ప్రాతిపదికన దిశ పోలీస్‌స్టేషన్, ఒన్‌స్టాప్‌ సెంటర్, డీ అడిక్షన్‌ సెంటర్ల ఏర్పాటు చేయాలన్నారు. 6 దిశ పోలీస్‌స్టేషన్లకు ఐఎస్‌ఓ సర్టిఫికెట్లు ఆవిష్కరించిన సీఎం తర్వాత దిశ పోలీస్‌స్టేషన్ల సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌ లో మాట్లాడారు.

దిశ యాప్‌ను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్న దానిపైనా ప్రజలకు ఎస్‌ఎంఎస్‌ సహా వివిధ మార్గాల్లో సమాచారం పంపాలని సూచించారు. అలాగే స్మార్ట్‌ ఫోన్లలో మాత్రమే కాకుండా మిగతా ఫోన్లలో కూడా 'దిశ' యాప్‌ సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు. దీని కోసం సంబంధిత కంపెనీలతో మాటాడాలమీ సీఎం సూచించారు. దిశ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం పొందేలా చూడటంతోపాటు ప్రత్యేక కోర్టులు వీలైనంత త్వరగా ఏర్పాటయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకం కూడా వీలైనంత త్వరగా చేపట్టాలని.. వేగంగా కేసుల విచారణ జరిగేలా చూడాలని చెప్పారు.

'దిశ' ప్రవేశపెట్టిన జనవరి నాటి నుంచి చురుగ్గా కార్యకలాపాలు సాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. 7 రోజుల్లోగా ఛార్జిషీటు నమోదు, త్వరితంగా శిక్షల ఖరారులో అడుగులు పడ్డాయి.. అప్పటినుంచి మహిళలపై 134 నేరాలు, చిన్నారులపై 33 నేరాలు నమోదయ్యాయి. మొత్తం 167 కేసుల్లో 7 రోజుల్లోగా ఛార్జిషీటు దాఖలు చేయగా.. 3 నెలల వ్యవధిలో 20 కేసుల్లో శిక్షలు పడ్డాయి.. ఇందులో 2 మరణశిక్షలు, 5 జీవిత ఖైదులు, 20 ఏళ్ల శిక్ష 1, ఏడేళ్ల శిక్ష 5, 3 ఏళ్ల శిక్ష పడ్డ కేసులు 3, మూడునెలల శిక్ష 3 ఉన్నాయి.. అలాగే జువనైల్‌హోంకు ఒకరిని పంపారు. ప్రత్యేక కోర్టులు లేకున్నా.. సరైన ఆధారాల సేకరణ, వేగవంతమైన విచారణల కారణంగా ఈ శిక్షలు పడేలా చేయగలిగామన్నారు అధికారులు.

దిశ యాప్‌ను 2.8 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారన్న అధికారులు 19,918 ఎస్‌ఓఎస్‌ రిక్వెస్ట్‌లు రిసీవ్ చేసుకున్నట్టు చెప్పారు. భర్త ద్వారా వేధింపులు 93 , మహిళలపై వేధింపులు 42 గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా వేధింపులు 42 , బంధువుల ద్వారా వేధింపులు 29 , ఇతరుల ద్వారా వేధింపులు 21 , పబ్లిక్‌ న్యూసెన్స్‌ 17 , ఫేక్‌ కాల్స్‌ 15 , చిన్నారులపై వేధింపులు 8 మహిళల అదృశ్యం 7 , సివిల్‌ వివాదాలు 7 , బాలికల అదృశ్యం 5 కేసులు కూడా ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories