ఈరోజు (మే-15 - శుక్రవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు (మే-15 - శుక్రవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Andhra Pradesh and Telangana updates from HMTVlive
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 15 మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్,...

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 15 మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Show Full Article

Live Updates

  • 15 May 2020 1:23 PM GMT

    ఏపీలో రేపటి నుంచి నాలుగో విడత రేషన్ పంపిణీ

    రేపటి నుంచి నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీకి ఏర్పాట్లు చేసిన ఏపీ సర్కార్

    - రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,48,05,879 కుటుంబాలకు లబ్ది

    - రాష్ట్రంలో బియ్యం కార్డు ఉన్న కుటుంబాలు 1,47,24,017

    - కొత్తగా దరఖాస్తు చేసుకున్న పేద కుటుంబాలు 81,862

    - కార్డుదారులకు మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం, కేజీ శనగలు

    - కార్డుదారులకు బయో మెట్రిక్ తప్పనిసరి

    - పోర్టబిలిటీ ద్వారా ఎక్కడ ఉంటే అక్కడే రేషన్ తీసుకునే వెసులుబాటు

    - రేషన్ షాప్ కౌంటర్ల వద్ద అందుబాటులో శానిటైజర్లు

    - రేషన్ తీసుకునేందుకు దుకాణాల వారీగా టైం స్లాట్ కూపన్లు

    - రాష్ట్రంలోని 28,354 రేషన్ దుకాణాలకు రద్దీని బట్టి అదనపు కౌంటర్లు.



     


  • 15 May 2020 12:06 PM GMT

    నీట్‌లో వివరాలు మార్చుకోవడానికి ఆఖరి అవకాశం

    దిల్లీ: అప్లికేషన్‌ ఫామ్‌లో అభ్యర్థి వివరాలు, సెంటర్ల ఎంపికలో మార్పులు చేసుకోవడానికి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (నీట్‌) మరో అవకాశం ఇచ్చింది.  కరోనా మహమ్మారి కారణంగా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు నీట్‌ తెలిపింది. అయితే మార్పునకు ఇదే ఆఖరి అవకాశమని స్పష్టం చేసింది. 

  • 15 May 2020 12:05 PM GMT

    తూర్పుగోదావరి జిల్లా : కొత్తపేటలో లాక్ డౌన్ సమయంలో ఉదయం 10 గంటలు దాటిన తరువాత నిభంధనలను అతిక్రమించి అనవసరంగా బయట బైక్ లపై తిరుగుతున్న సుమారు 50 పైగా మోటార్ సైకిళ్ళు ను కొత్తపేట ఎస్.ఐ కె.రమేష్ తన సిబ్బందితో కలిసి సీజ్ చేశారు. అనంతరం వాటిని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ సందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూ కొత్తపేట లో రెడ్ జోన్ ఉన్న కారణంగా మేము ఇచ్చిన టైం ప్రకారం ఉదయం 6 నుండి 10 గంటల లోపులో ఎవరికి వారు నిత్యావసర తదితర వస్తువులు కొనుగోలు చేసుకుని ఎవరి ఇళ్లకు వారు పెళ్ళిపోవాలని సూచించారు. ఉదయం 10 తరువాత అనవసరంగా బయట తిరిగితే వారి బైక్స్ ను సీజ్ చేయడంతో పాటుగా వారిని క్వారంటీన్ కు పంపిస్తామని హెచ్చరించారు.



     


  • 15 May 2020 12:03 PM GMT

    తూ.గో. జిల్లా: కాట్రేనికోన మండలం పల్లంకుర్రు పంచాయతీ పరిధిలో రామాలయంపేట వద్దగల వృద్దగౌతమి నదిలో బోట్ల ద్వారా అక్రమంగా రవాణా అవుతున్న 3000 లీటర్ల డీజిల్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. 7 మంది పై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు అమలాపురం DSP షేక్ మసూమ్ భాషా వెల్లడి.

    అమలాపురం సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడైనా ఆయిల్ మాఫియా ,ఆయిల్ స్మగ్లింగ్, అక్రమ ఇసుక రవాణా, అక్రమ మద్యం వంటి చర్యలకు పాల్పడితే ఉక్కుపాదం మోపుతామని డిఎస్పీ హెచ్చరిక.

  • 15 May 2020 8:28 AM GMT

    పల్లె వెలుగు బస్సులో 30 మంది వరకే ఎంట్రీ

    సుదీర్ఘ విరామం తరువాత ఈ నెల 18 నుంచి బస్సులు నడిపేందుకు పౌర రవాణా శాఖ (పీటీడీ) విశాఖ రీజియన్‌ యాజమాన్యం సిద్ధమవుతున్నది. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన వెంటనే బస్సులను రోడ్డెక్కించడానికి సన్నద్ధం అవుతోంది.కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రయాణికుల మధ్య భౌతిక దూరం వుండేలా బస్సుల సీటింగ్‌లో మార్పులు, చేర్పులు చేస్తోంది. అదేవిధంగా ప్రయాణికులు చేతులు శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్‌, లిక్విడ్‌ హ్యాండ్‌ వాష్‌ అందుబాటులో ఉంచనున్నది. కానీ పల్లె వెలుగు బస్సుల్లో సీట్లను మార్చడం లేదు. అయితే 50 సీట్లకుగాను 30 సీట్లలో మాత్రమే ప్రయాణికులు కూర్చోవాలి. ఈ మేరకు ఆయా బస్సుల్లో మార్కింగ్‌ చేయిస్తున్నారు. బస్సుల్లో నిల్చుని ప్రయాణించడానికి అనుమతించరు. పల్లె వెలుగు బస్సుల్లో కండక్టర్లు ఉండరు. డ్రైవర్ల వద్ద టిమ్స్‌ ఉంటాయి. బస్టాండ్‌లో బస్సు ఎక్కే ముందే అక్కడ వుండే సిబ్బంది టిమ్స్‌తో టిక్కెట్లు జారీచేస్తారు. గతంలో మాదిరిగా అన్ని స్టాపుల్లో ఆపరు. లిమిటెడ్‌ హాల్ట్స్‌ మాత్రమే ఉంటాయి.

  • 15 May 2020 8:26 AM GMT

    మద్యo నియంత్రణలో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

    మద్యo నియంత్రణలో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.

    ఎక్సైజ్ శాఖకు చెందిన ఉద్యోగులను స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోకు కేటాయింపు.

    70 శాతం ఉద్యోగులు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోకు కేటాయింపు.

    ఇకపై నామమాత్రంగా మారనున్న ఏపీ ఎక్సైజ్ శాఖ.

    మద్యం దుకాణాలు,డిస్టరీల నిర్వహణకే పరిమితం కానున్న ఎక్సైజ్ శాఖ.

    మద్య నియంత్రణలో భాగంగా స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోకు అదనపు అధికారులు.

  • 15 May 2020 5:53 AM GMT

    ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధులు.

    ఆరోగ్యశ్రీ హస్పిటల్స్‌కు ప్రభుత్వం నుంచి రావాల్సిన పేమెంట్స్‌ను సకాలంలో విడుదల చేసినందుకు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపిన అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, కార్యదర్శి డాక్టర్‌ పీ బీ కామేశ్వరరావులు.

    పాల్గొన్న ఉపాధ్యకుడు‌ డాక్టర్‌ కేతిరెడ్డి మోహన్‌రెడ్డి, గుంటూరు ఇన్‌ఛార్జ్‌ డాక్టర్‌ పీ వీ రాఘవ శర్మ, డాక్టర్‌ సిస్టర్‌ క్లెటెస్, సిస్టర్‌ యానీ, పశ్చిమ గోదావరి ఇన్‌ఛార్జ్‌ ఇర్రింకి నరేష్‌ కర్నా, కృష్ణా జిల్లా ఇన్‌ ఛార్జ్‌ డాక్టర్‌ వై రమేష్‌(ఆయుష్‌ హాస్పిటల్స్‌), తూర్పుగోదావరి ఇన్‌ఛార్జ్‌ డాక్టర్‌ కె విజయ్‌ కుమార్‌లు, రాయలసీమ ఇన్‌ఛార్జ్‌ డాక్టర్‌‌ నిరంజన్ రెడ్డి.



     


  • 15 May 2020 5:51 AM GMT

    నేడు ఎల్‌జీ పాలిమర్స్‌ను సందర్శించనున్న ఎన్జీటీ కమిటీ చైర్మన్‌

    విశాఖపట్నం: 

    ◆ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌లీక్‌ ఘటనపై విచారణకు జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నియమించిన కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ శేషశయనరెడ్డి గురువారం విశాఖ వచ్చారు.

    ◆ఈ కమిటీలో ముగ్గురు సభ్యుల బృందం మూడు రోజుల క్రితమే ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీని సందర్శించి బాధిత గ్రామాల్లో పర్యటించింది.

    కమిటీకి నేతృత్వం వహించే శేషశయనరెడ్డి శుక్రవారం కంపెనీని సందర్శించి ప్రమాద కారణాలపై విచారణ చేపడతారు.

    ◆అనంతరం బాధిత గ్రామాల్లో పర్యటించి అధికారులతో భేటీ కానున్నారు.

  • 15 May 2020 5:48 AM GMT

    ట్రాక్టర్ ప్రమాద బాధితులకు మంత్రుల పరామర్శ

    ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మాచవరం ట్రాక్టర్ ప్రమాద బాధిత కుటుంబాలను రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాస రెడ్డి, అదిమూలపు సురేష్ లు పరామర్శించారు. శుక్రవారం ఉదయం ఒంగోలు లోని సర్వ జన ఆసుపత్రిలో మృతదేహాలను సందర్శించి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబాలకు చెందిన వారిని పరామర్శించారు.

    అనంతరం మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు. ప్రభుత్వం నుంచి నిబంధనల మేరకు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాద ఘటన పై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. భాదితులు తమకు గ్రామంలో ఇంటి స్థలలు కావాలని కోరారని ఈ విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. కాగా, ప్రమాదంలో మృతి చెందిన 10 మంది మృత దేహాలకు ఒంగోలు రిమ్స్ లో ఈరోజు ఉదయం పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.

  • 15 May 2020 5:08 AM GMT

    పొంచి ఉన్న యాంపిన్ తుపాను ముప్పు

    తీవ్ర అల్పపీడనంగా మారిన ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం. ఇది వాయుగుండంగా మారి శుక్రవారానికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 

    - పూర్తి వివరాలు 

Print Article
More On
Next Story
More Stories