బలపడిన అల్పపీడనం.. ముంచుకొస్తున్న 'యాంపిన్' తుపాను!

బలపడిన అల్పపీడనం.. ముంచుకొస్తున్న యాంపిన్ తుపాను!
x
rain forecast in Andhra Pradesh (rep image)
Highlights

తీవ్ర అల్పపీడనంగా మారిన ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం. ఇది వాయుగుండంగా మారి శుక్రవారానికి దక్షిణ మధ్య...

తీవ్ర అల్పపీడనంగా మారిన ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం. ఇది వాయుగుండంగా మారి శుక్రవారానికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ వాయుగుండం 16వ తేదీ సాయంత్రం లేదా 17వ తేదీ ఉదయానికి తుఫాన్‌గా మారుతుందని తెలుస్తోంది. మొదట ఈ తుపాను వాయవ్యంగా, తర్వాత ఉత్తర ఈశాన్యంగా పయనించే క్రమంలో మరింత బలపడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.

ఈనెల 17న 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైనగాలులు వీస్తాయని, 18న ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిసా తీరం వెంబడి గాలులు తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.ఈ తుఫాన్‌కు 'యాంపిన్‌'గా నామకరణం చేశారు.

కాగా, ఉపరితల ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో 15వ తేదీన ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో ఓ మోస్తరు వర్షం, 16న భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. 15న రాయలసీమలో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు, 16న ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories