బైడెన్ పై ట్రంప్ ఆరోపణలు: ఆటో‌పెన్ అంటే ఏంటి?

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ క్షమాభిక్షలు చెల్లవని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెబుతున్నారు.

Update: 2025-03-18 09:04 GMT

బైడెన్ పై ట్రంప్ ఆరోపణలు: ఆటో‌పెన్ అంటే ఏంటి?

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ క్షమాభిక్షలు చెల్లవని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెబుతున్నారు. బైడెన్ ఇచ్చిన క్షమాభిక్షలన్నింటిపై ఆటో పెన్ తో సంతకం చేయడంతో వాటి గురించి అసలు ఆయనకు ఏమీ తెలియదన్నది ట్రంప్ వాదన. ట్రంప్ ప్రకటనతో ఆటో పెన్ అంశం తెరమీదికి వచ్చింది.

అసలు ఆటో పెన్ అంటే ఏంటి?

ఆటో పెన్ అనేది ఆటోమెటిక్ లేదా రిమోట్ సంతకాల కోసం ఉపయోగించే పరికరం. సాధారణ ఇ- సిగ్నేచర్ మాదిరిగా కాకుండా సెలబ్రిటీలు, వాణిజ్య అవసరాల కోసం ఎక్కువ సంఖ్యలో సంతకాలు చేయడానికి దీన్ని వాడుతారు. ఒక ప్రింటర్ సైజులో యాంత్రిక హస్తంతో ఇది ఉంటుంది. ఇందులో ప్రోగ్రామ్ చేసి సంతకం మాదిరిగానే సంతకాలు చేయగలదు.

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్య్లు బుష్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఆటోపెన్ ఉపయోగించే పద్దతిని చట్టబద్దంగా అనుమతించారు. అమెరికా అధ్యక్షుడు తాను ఆమోదించిన బిల్లుపై వ్యక్తిగతంగా సంతకం చేయకున్నా ఆటోపెన్ ను ఉపయోగించినా చెల్లుబాటు అవుతోంది.2011లో బరాక్ ఒబామా తరపున ఆటో పెన్ ను ఉపయోగించారని చెబుతారు.

ఆటోపెన్ ఎక్కడి నుంచి వచ్చింది?

19వ శతాబ్దం తొలినాళ్లలో పాలీగ్రాఫ్ యంత్రం వాడేవారు. 1803లో దీనిపై పేటెంట్ లభించింది. అప్పట్లో థామస్ జెఫర్సన్ తాను అధ్యక్షుడిగా ఉన్నసమయంలోనూ ఆ తర్వాత కూడా దీన్ని ఉపయోగించినట్టు చరిత్ర చెబుతోంది."పాలీగ్రాఫ్ వాడకం వల్ల పాత కాపీయింగ్ ప్రెస్ నాకు చాలా ఇష్టం లేదు, దాని కాపీలు చదవడానికి చాలా కష్టంగా ఉన్నాయి" అని జెఫెర్సన్ 1809లో రాశారు. "ఇప్పుడు నేను పాలీగ్రాఫ్ లేకుండా జీవించలేనని ఆయన రాసినట్టుగా చెబుతారు. ఆటోపెన్ అభివృద్ధి చెందుతున్నప్పుడు, రెండవ ప్రపంచ యుద్ధంలో వర్జీనియాలోని నావికా టార్పెడో ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు రాబర్ట్ డి షాజో జూనియర్ అనే వ్యక్తి ప్రారంభ డిజైన్ గురించి తెలుసుకున్నారు. అతను ఈ సాంకేతికతను సృష్టించారు. కొంతకాలం తర్వాత వాణిజ్యపరంగా దానిని ఉత్పత్తిని ప్రారంభించారు.డి షాజో మొదటి ఆర్డర్ నేవీ కార్యదర్శి నుండి వచ్చింది.ఆ పరికరాలు త్వరగా ప్రభుత్వంలో సర్వసాధారణంగా మారాయి.

ఆటోపెన్‌తో సంతకం చేస్తే క్షమాభిక్ష రద్దు చేస్తారా?

క్షమాభిక్షకు సంబంధించిన పత్రాలను జోబైడెన్ ఆటోపెన్ ను ఉపయోగించారా లేదా అనేది స్పష్టం కాలేదు. ఒకవేళ బైడెన్ ఆటోపెన్ ను ఉపయోగించినా క్షమాభిక్ష రద్దు చేయవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షులకు విస్తృత అధికారాలున్నాయి. దీని మేరకు అధ్యక్షుడు క్షమాభిక్ష ప్రకటించవచ్చు. అయితే ఆటోపెన్ తో క్షమాభిక్ష పత్రంపై సంతకం చేస్తే అది రద్దు అవుతోందనే ప్రచారంలో వాస్తవం లేదని నిపుణులు చెబుతున్నారు. క్షమాభిక్షపై సంతకం చేయాల్సిన అవసరం కూడా లేదనేది వారి వాదన.

Tags:    

Similar News