Joe Biden:అమెరికా అధ్యక్షుడికి కోవిడ్ పాజిటివ్..ఐసోలేషన్‎లో ఉన్నారని వైట్‎హౌస్ ప్రకటన

Joe Biden:అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కోవిడ్ బారిన పడ్డారు. ఈ మేరకు వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపింది.

Update: 2024-07-18 02:35 GMT

Joe Biden: అమెరికా అధ్యక్షుడికి కోవిడ్ పాజిటివ్..ఐసోలేషన్‎లో ఉన్నారని వైట్‎హౌస్ ప్రకటన

Joe Biden:అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు వైట్ హౌస్ ప్రకటన రిలీజ్ చేసింది. అధ్యక్షుడు స్వల్ప దగ్గు, జలుబుతోపాటు జ్వరంతో బాధపడుతున్నారని పేర్కొంది. ప్రస్తుతం బైడెన్ డెలావేర లోని సముద్రతీరంలో ఉన్న తన ఇంట్లో ఐసోలేషన్ లో ఉంటూ కోవిడ్ మందులు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా లాస్ వెగాస్ లో ప్రచారంలో ఉన్న బైడెన్ కు కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లు తేలడంలో వెంటనే ఆయన ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు మీడియాకు వెల్లడించారు.

అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కోవిడ్ బారిన పడ్డారు. ఈ మేరకు వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపింది.

మంగళవారం బైడెన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తనకు తీవ్ర అనారోగ్య సమ్యలు తలెత్తితే అధ్యక్ష బరి నుంచి వైదొలుగుతానని ప్రకటించారు. అలా చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే అనారోగ్యానికి గురికావడం గమనార్హం. 

Tags:    

Similar News