కశ్మీర్ అంశంపై వక్రబుద్ధిని మార్చుకోని టర్కీ.. అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశం ప్రస్తావన
కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవద్దని గతంలో భారత్ హెచ్చరించినా... టర్కీ మాత్రం తన వక్రబుద్ధి మార్చుకోలేదు.
కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవద్దని గతంలో భారత్ హెచ్చరించినా... టర్కీ మాత్రం తన వక్రబుద్ధి మార్చుకోలేదు. అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ గురించి మాట్లాడటం టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌కు అలవాటుగా మారింది. తన మిత్రదేశమైన పాకిస్తాన్‌కు మరోసారి వత్తాసు పలికింది. ఐక్యరాజ్య సమితిలో టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ కశ్మీర్ అంశాన్ని లేనెత్తారు. యూఎన్ జనరల్ అసెంబ్లీ సెషన్‌లోని అత్యున్నత స్థాయి 78వ సెషన్‌లో ఎర్డోగాన్ ప్రసంగించారు. భారత్, పాక్ మధ్య ఇప్పటికీ కొనసాగుతున్న కశ్మీర్ వివాదం, దక్షిణాసియా ఉద్రిక్తతలకు కారణమైందని పాకిస్థాన్‌పై తన ప్రేమను చూపించుకున్నారు.
జీ20 సమ్మిట్‌లో ప్రధాని మోదీతో వాణిజ్యం, మౌలిక సదుపాయాల సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చలు జరిపిన వారం రోజుల తర్వాత ఎర్డోగాన్ కశ్మీర్ అంశంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. జమ్మూకశ్మీర్ అంతర్గత విషయమని భారత్ పదేపదే హెచ్చరికలు చేస్తున్నప్పటికీ.. ఎర్డోగాన్ తన తీరు మాత్రం మార్చుకోవడం లేదు. ఆయన కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడం ఇదే తొలిసారి కాదు. గతంలో అనేకసార్లు దీనిపై మాట్లాడారు. 2019 నుంచి ఐక్యరాజ్య సమితి ప్రసంగాల్లో నిరంతరం కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతూనే ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలోను, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో భేటీ సమయంలోను ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. నాడు భారత్ వాటిని తీవ్రంగా ఖండించింది.
అంతర్జాతీయ వేదికలపై ఆయన కాశ్మీర్ అంవాన్ని ప్రస్తావించడం ఇదేమి మొదటిసారి కాదు. ఈ ఏడాది మొదట్లో పాకిస్తాన్ పర్యటనలో కూడా ఎర్డోగన్ కాశ్మీర్ అంశంపై చర్చలు జరపాలని...UN తీర్మానాలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. తామెప్పుడూ కశ్మీర్ కు సంఘీభావంగా నిలుస్తామని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ముస్లిం దేశాల్లో తుర్కియే, అజర్ బైజాన్ మాత్రమే పాక్‌కు మద్దతు ప్రకటించాయి. ఉద్రిక్తతల వేళ తుర్కియే డ్రోన్లనే పాక్ మన దేశంపై ప్రయోగించింది. సైనిక సిబ్బందిని పంపినట్టు కూడా ప్రచారం జరిగింది. దీంతో టర్కీ, అజర్‌బైజాన్‌ను బహిష్కరించాలంటూ భారత్ ప్రజానీకం మండిపడింది. అయినప్పటికీ భారత్‌పై విషం కక్కడంలో పాక్‌తో అంటకాడుతున్న తుర్కియే మరోసారి తన నైజం చాటుకుంది.
టర్కీ అధ్యక్షుడి వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా తిరస్కరించింది. ఎర్డోగన్ తమ అంతర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ ఇండియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. దీనిపై వ్యాఖ్యానించడానికి మరే దేశానికీ ఎటువంటి హక్కు లేదని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. మరొక దేశం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే బదులు పాకిస్తాన్ లో ప్రబలుతున్న సీమాంతర ఉగ్రవాదాన్ని ఎత్తిచూపాలని జైస్వాల్ సూచించారు. దానిపై ఎర్డోగన్ యూఎన్ లో మాట్లాడి ఉంటే సముచితంగా ఉండేదని అన్నారు. కశ్మీర్‌పై మాట్లాడే హక్కు ఏ ఇతర దేశానికి లేదని జైస్వాల్ మరోసారి గట్టిగా చెప్పారు.