Stock Market Crash :భారీ పతనం.. 1470 పాయింట్లు కూలిన సెన్సెక్స్, రూ.10 లక్షల కోట్లు ఆవిరి

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ 1470 పాయింట్లు పడిపోయి మదుపర్లకు రూ.10 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది.

Update: 2026-03-13 11:11 GMT

Stock Market Crash :భారీ పతనం.. 1470 పాయింట్లు కూలిన సెన్సెక్స్, రూ.10 లక్షల కోట్లు ఆవిరి

Stock Market క్రాష్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, చమురు ధరల పెరుగుదల, విదేశీ సంస్థాగత మదుపర్ల (FII) భారీ అమ్మకాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. దీంతో సూచీలు వరుసగా మూడో రోజూ నష్టాలను నమోదు చేశాయి.

ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ (BSE) సెన్సెక్స్ ఒక దశలో 1470 పాయింట్లు పడిపోయింది. చివరకు 1470.50 పాయింట్ల నష్టంతో 74,563.92 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ కూడా 488 పాయింట్లు పడిపోయి 23,151 వద్ద స్థిరపడింది.

మార్కెట్లలో వచ్చిన ఈ పతనంతో పెట్టుబడిదారుల సంపదకు భారీ దెబ్బ తగిలింది. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ సుమారు రూ.10 లక్షల కోట్లు క్షీణించి 429 లక్షల కోట్లకు చేరింది.

సెన్సెక్స్ సూచీలో హిందుస్థాన్ యూనిలీవర్, భారతీ ఎయిర్‌టెల్ తప్ప మిగిలిన అన్ని స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఎల్ అండ్ టీ, టాటా స్టీల్, ఎస్‌బీఐ, బీఈఎల్, మారుతీ సుజుకీ షేర్లు భారీగా పడిపోయాయి.

ఇక అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్‌కు 100.61 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. చమురు ధరలు పెరగడంతో రూపాయి విలువపై కూడా ఒత్తిడి పెరిగింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 92.45 వద్ద కొనసాగుతోంది.

మరోవైపు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ చేసిన ప్రకటనతో హర్మూజ్ జలమార్గం మూసివేత కొనసాగుతుందని వెల్లడించడం చమురు ధరలను మరింత పెంచింది. చమురు ధరలు పెరగడం వల్ల దిగుమతుల వ్యయం పెరిగి రూపాయి విలువపై ప్రతికూల ప్రభావం పడుతోంది.

అమెరికాలో బాండ్లపై రాబడులు పెరగడం కూడా భారత స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. అమెరికాలో రెండేళ్ల మరియు 10 ఏళ్ల బాండ్లపై ఈల్డ్స్ పెరగడంతో వర్ధమాన దేశాల మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్లే పరిస్థితి ఏర్పడింది.

దేశీయంగా కూడా ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతున్నాయి. గురువారం ఒక్కరోజే రూ.7050 కోట్ల విలువైన షేర్లను విదేశీ మదుపర్లు విక్రయించారు. గత 10 ట్రేడింగ్ సెషన్లలో మొత్తం రూ.57 వేల కోట్ల షేర్లు విక్రయించడం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో మదుపరులు తీవ్ర నిరాశలో ఉన్నారు.

Tags:    

Similar News