Trump Warns India: 'మోదీ మంచోడే.. కానీ నేను హ్యాపీగా లేను': భారత్‌పై ట్రంప్ 'టారిఫ్' హెచ్చరిక!

Trump Warns India: రష్యా నుంచి భారత్ ముడి చమురు (Crude Oil) కొనుగోలు చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Update: 2026-01-05 05:59 GMT

Trump Warns India: 'మోదీ మంచోడే.. కానీ నేను హ్యాపీగా లేను': భారత్‌పై ట్రంప్ 'టారిఫ్' హెచ్చరిక!

Trump Warns India: రష్యా నుంచి భారత్ ముడి చమురు (Crude Oil) కొనుగోలు చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో భారత్ తమకు సహకరించకపోతే, భారతీయ ఉత్పత్తులపై వాణిజ్య సుంకాలను (Tariffs) మరింత పెంచుతామని ఆయన హెచ్చరించారు. వెనిజులా పరిణామాలపై విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో ట్రంప్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీతో తనకున్న వ్యక్తిగత స్నేహాన్ని ప్రస్తావిస్తూనే, వాణిజ్య విషయంలో ట్రంప్ కఠినంగా స్పందించారు. "ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి. ఆయన గొప్ప స్నేహితుడు. అయితే రష్యా చమురు విషయంలో నేను సంతోషంగా లేనని ఆయనకు తెలుసు. నన్ను సంతోషంగా ఉంచడం వారికి చాలా ముఖ్యం. వారు మాతో వ్యాపారం కొనసాగిస్తున్నారు, కానీ రష్యా విషయంలో సహకరించకుంటే మేం చాలా వేగంగా సుంకాలు పెంచగలం. అది వారికి ఏమాత్రం మంచిది కాదు" అని ట్రంప్ స్పష్టం చేశారు.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకే గతేడాది ఆగస్టులో భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నప్పటికీ, రష్యా నుంచి దిగుమతులు తగ్గకపోతే ఈ సుంకాలను మరిన్ని రెట్లు పెంచుతామని ట్రంప్ తాజా హెచ్చరికలు జారీ చేయడం భారత ఎగుమతిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది.

అయితే, తమ దేశ ఇంధన భద్రత దృష్ట్యా, మార్కెట్ ధరల ఆధారంగానే చమురు కొనుగోళ్లు ఉంటాయని భారత్ మొదటి నుంచీ స్పష్టం చేస్తోంది. రష్యా నుంచి దిగుమతులు కొంత మేర తగ్గినప్పటికీ, పూర్తిగా నిలిపివేసే ప్రసక్తి లేదని గతంలో విదేశాంగ శాఖ సంకేతాలిచ్చింది. ఇప్పుడు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News