JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఇంటిపై దాడి

JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ నివాసంపై ఒక దుండగుడు దాడికి తెగబడటం అక్కడ కలకలం రేపింది.

Update: 2026-01-05 12:11 GMT

 JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఇంటిపై దాడి

JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ నివాసంపై ఒక దుండగుడు దాడికి తెగబడటం అక్కడ కలకలం రేపింది. ఈ ఘటనలో ఆయన ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే, ప్రమాద సమయంలో వాన్స్‌ గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ ఇంట్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

అధికారుల సమాచారం ప్రకారం.. ఒక గుర్తుతెలియని వ్యక్తి జేడీ వాన్స్‌ ఇంటిపైకి దూసుకువచ్చి అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఇంటి కిటికీ అద్దాలు పగిలిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా సిబ్బంది మరియు పోలీసులు రంగ ప్రవేశం చేసి, నిందితుడిని అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు.

దాడి జరిగిన సమయంలో ఉపాధ్యక్షుడి కుటుంబం ఇంట్లో లేదని, వారు సురక్షితంగా ఉన్నారని ఉన్నతాధికారులు ధృవీకరించారు. నిందితుడు ఈ దాడికి ఎందుకు పాల్పడ్డాడు? దీని వెనుక ఉన్న కారణాలేంటి? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఉపాధ్యక్షుడి నివాసం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Tags:    

Similar News