Pakistan: టీ20 వరల్డ్ కప్ 2026 పాకిస్థాన్ జట్టు ప్రకటన.. బాబర్ ఉన్నాడు కానీ రిజ్వాన్‌కు షాక్!
టీ20 ప్రపంచకప్ 2026 కోసం పాకిస్థాన్ తన 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. సల్మాన్ అలీ అఘా సారథ్యంలో బాబర్ ఆజమ్ చోటు దక్కించుకోగా, స్టార్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌కు పీసీబీ షాకిచ్చింది.
భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్ 2026 కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఆదివారం తమ 16 మంది సభ్యులతో కూడిన ప్రొవిజనల్ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న పీసీబీ.. రిజ్వాన్ లాంటి స్టార్ ప్లేయర్‌కు మొండిచేయి చూపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
సల్మాన్ అలీ అఘా సారథ్యంలో..
అందరూ ఊహించినట్లుగా కాకుండా, ఈ మెగా టోర్నీ కోసం సల్మాన్ అలీ అఘాను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అయితే వైస్ కెప్టెన్ ఎవరనేది బోర్డు ఇంకా వెల్లడించలేదు.
బాబర్ వచ్చేశాడు.. రిజ్వాన్ అవుట్!
గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ ఎట్టకేలకు జట్టులో చోటు సంపాదించుకున్నాడు. బాబర్ ఎంపికపై వస్తున్న విమర్శలకు బోర్డు పరోక్షంగా చెక్ పెట్టింది. అయితే, మాజీ వైట్-బాల్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌కు జట్టులో చోటు దక్కకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అతని స్థానంలో ఉస్మాన్ ఖాన్‌ను వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు.
అఫ్రిది ఫిట్‌నెస్‌పై సందిగ్ధం
స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిదిని జట్టులోకి తీసుకున్నప్పటికీ, అతని ఫిట్‌నెస్ ఆందోళన కలిగిస్తోంది. బిగ్‌బాష్ లీగ్‌లో మోకాలి గాయానికి గురైన అఫ్రిదికి బ్యాకప్‌గా హరీస్ రౌఫ్‌ను సిద్ధం చేశారు. అలాగే స్పిన్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.
పాకిస్థాన్ ప్రొవిజనల్ జట్టు ఇదే:
(మిగిలిన సభ్యులు: ఫహీమ్ అష్రఫ్, మొహమ్మద్ వసీం జూనియర్, అబ్దుల్ సమద్, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా)
ఫిబ్రవరి 15న భారత్‌తో 'మహా' సమరం
టీ20 ప్రపంచకప్ గ్రూప్-ఏలో పాకిస్థాన్ ఉంది. ఇదే గ్రూప్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్ కూడా ఉండటంతో పోరు రసవత్తరంగా మారనుంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్-పాక్ మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. కాగా, జనవరి 11న శ్రీలంకతో జరిగే సిరీస్ తర్వాత పూర్తిస్థాయి మెయిన్ స్క్వాడ్‌ను ప్రకటించనున్నారు.