Donald Trump: కమలా హారిస్‌పై మరోసారి నోరుపారేసుకున్న ట్రంప్
Donald Trump: అమె భారతీయురాలా...? నల్లజాతీయురాలా...?
Donald Trump: కమలా హారిస్‌పై మరోసారి నోరుపారేసుకున్న ట్రంప్
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు డెమోక్రటిక్ పార్టీ తరఫున సిద్ధమవుతున్న కమలా హారిస్‌పై డొనాల్డ్ ట్రంప్ మళ్లీ నోరుపారేసుకున్నారు. షికాగోలోని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్ట్‌ల సదస్సులో ట్రంప్ పాల్గొన్నారు. ఆమె ఎల్లప్పుడూ భారతీయ వారసత్వానికి చెందినవారే నని... దాన్ని ఇన్నాళ్లూ ప్రచారం చేస్తూ వచ్చారన్నారు. ఆమె నల్లజాతీయురాలని కొన్నేళ్ల క్రితం వరకు తనకు తెలియదన్నారు. కానీ ఆమె ఉన్నట్టుండి నల్లజాతీయురాలిగా మారారని విమర్శించారు. ఇంతకీ ఆమె భారతీయురాలా.. నల్లజాతీయురాలా అంటూ ప్రశ్నించారు.
తన జాతీయతను ప్రశ్నిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలకు హారిస్ ధీటుగా బదులిచ్చారు. మళ్లీ మళ్లీ పాత పాటే పాడుతున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. వాస్తవాలను చెప్పాల్సి వచ్చినప్పుడు శత్రుత్వం, కోపంతో స్పందించేవారు మనకు వద్దని... వాస్తవాలను అంగీకరించి వాటిని ధైర్యంగా చెప్పే నాయకులు కావాలని కమలా హారిస్ కౌంటర్ ఇచ్చారు.