Netanyahu: ఇరాన్ సుప్రీం లీడర్ ను హతమారిస్తేనే యుద్ధానికి ముగింపు..ఇజ్రాయెల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..!!

Netanyahu: ఇజ్రాయెల్, ఇరాన్ ల మధ్య యుద్ధం రోజుకురోజుకు ముదురుతోంది. ఇరుదేశాలు మిస్సైళ్లతో దాడి చేసుకుంటున్నాయి.

Update: 2025-06-17 02:49 GMT

Netanyahu: ఇరాన్ సుప్రీం లీడర్ ను హతమారిస్తేనే యుద్ధానికి ముగింపు..ఇజ్రాయెల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..!!

Netanyahu: ఇజ్రాయెల్, ఇరాన్ ల మధ్య యుద్ధం రోజుకురోజుకు ముదురుతోంది. ఇరుదేశాలు మిస్సైళ్లతో దాడి చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఇరు దేశాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రపంచ దేశాలు ఈ యుద్దాన్ని గమనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అంతమొందిస్తే యుద్ధం ముగుస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇరాన్ యుద్ధం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

టెహ్రాన్ పై టెల్ అవీవ్ చేస్తున్న దాడులను నెతన్యాహు వివరించారు. ఇరుదేశాల మధ్య సంస్కరణను పెంచేకంటే త్వరగా యుద్ధాన్ని ముగించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. చాలా ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఇరాన్ అస్థిరపరిచే శక్తిగా మారుతోంది. అర శతాబ్దంగా ఇరాన్ పాలనతో ప్రతిఒక్కరూ భయపడేవిధంగా మారింది. సౌదీ అరేబియాలోని ఆరామ్ కో చమురు క్షేత్రాలపైనా దాడులు జరిగాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాద వ్యాప్తి, విధ్వంసం, వ్యవస్థలను బలహీనంగా చేయడం పెరిగింది అని నెతన్యాహు అన్నారు.

ఇరాన్ అణు లక్ష్యాలు ప్రపంచానికి ప్రమాదకరమని నెతన్యాహు అభివర్ణించారు. మేము కేవలం మా శత్రువుతో మాత్రమే యుద్ధాన్ని చేయడం లేదు..వారు ఇజ్రాయెల్ కు అమెరికాకు మరణమని నినాదాలు చేస్తున్నారు. మేము సైతం వారి దారిలోనే నడుస్తున్నాము అది త్వరలో అమెరికాకు కూడా చేరుతుంది. ఇరాన్ చేపట్టిన శాశ్వత యుద్ధంను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ చర్యలను చేపట్టింది. ఇరాన్ చేపట్టిన శాశ్వత యుద్ధం ప్రపంచాన్ని అణువిపత్తు వైపు తీసుకెళ్తోంది. అయితే దాని దురాక్రమణను అంతం చేయడం, దుష్టశక్తులను ఎదురించి పోరాడటం ద్వారా ఇజ్రాయెల్ దాన్ని అడ్డుకుంటోందని నెతన్యాహు అన్నారు.

Tags:    

Similar News